పల్నాడు జిల్లా నరసరావుపేటలోని అమరా ఇంజనీరింగ్ కళాశాల చైర్మన్ అమరా వెంకటేశ్వరావు సోమవారం పురుగుల మందు తాగి ఆత్మహత్యకు పాల్పడ్డారు. పురుగుల మందు తాగిన ఆయన్ను.. బంధువులు వెంటనే చికిత్స నిమిత్తం పట్టణంలోని ఓ ప్రయివేట్ వైద్యశాలకు తరలించారు. పరిస్థితి విషమించడంతో మృతి చెందినట్లు వైద్యులు వెల్లడించారు.
అమరా వెంకటేశ్వరరావు భార్య సుధారాణి తెలిపిన వివరాల ప్రకారం.. 2011వ సంవత్సరం లో కెనరా బ్యాంకు నుండి కళాశాల తరపున రూ.13 కోట్లు అప్పుతీసుకున్నారు. 2017 వరకు రూ.25 కోట్లను తిరిగి చెల్లించామని వివరించారు. అయితే అప్పటికీ అప్పు తీరలేదని బ్యాంకు అధికారులు కోర్టు ను ఆశ్రయిస్తే కళాశాలలో సాామగ్రిని యాజమాన్యానికి అప్పగించి కళాశాలకు తాళం వేసుకోవచ్చని తీర్పు ఇచ్చిందన్నారు. కానీ, కెనరా బ్యాంకు అధికారులు కళాశాలలో సామగ్రిని ఇవ్వకుండా మొత్తం సీజ్ చేశారని ఆరోపించింది. అప్పటినుండి నరసరావుపేట, గుంటూరు, విజయవాడ, బెంగుళూరులో కెనరా బ్యాంకు బ్రాంచీ లకు వెళ్లి వివరాలు తెలిపినా ఏ ఒక్క బ్యాంకు అధికారి స్పందించలేదని వాపోయింది.