ACB raids: పల్నాడు జిల్లా బొల్లాపల్లి తహశీల్దార్ కార్యాలయంలో ఏసీబీ దాడులు జరిగాయి. వినుకొండ మండలం నుంచి అవినీతిపై 14400 నంబరకు అత్యధికంగా ఫిర్యాదులు రావడంతో తనిఖీలు నిర్వహించినట్లు ఏఎస్పీ వెంకట్రావు తెలిపారు. తహశీల్దార్ ఛాంబర్లో టేబుల్ కింద రెండు కవర్లలో రూ.19వేలు, సిబ్బంది దగ్గర లెక్కలు లేని నగదు రూ.12వేలు ఉన్నట్లు గుర్తించి స్వాధీనం చేసుకున్నామన్నారు. తహశీల్దారు వద్ద 9 పట్టాదారు పాసు పుస్తకాలు ఉన్నాయి. వీటిని దరఖాస్తుదారునికి ఇవ్వకుండా దాచారని గుర్తించామని, మీసేవ ద్వారా వచ్చిన రెవెన్యూ దరఖాస్తుల్లో మ్యుటేషన్, పట్టాదారు పాసు పుస్తకాలు, వెబ్‌ల్యాండ్ తదితర 119 దరఖాస్తులు 45 రోజుల గడువు దాటినా పరిష్కారం చేయకుండా పెండింగ్‌లో చూపించడాన్ని గుర్తించామని తెలిపారు.
ACB raids: బొల్లాపల్లి తహశీల్దార్ కార్యాలయంలో ఏసీబీ తనిఖీలు - పల్నాడు జిల్లా తాజా వార్తలు
ACB raids: బొల్లాపల్లి తహశీల్దార్ కార్యాలయంలో సోమవారం అవినీతి నిరోధకశాక (అనిశా) అధికారులు తనిఖీలు చేశారు. లెక్క తేలని నగదు రూ.31వేలు స్వాధీనం చేసుకున్నారు. మధ్యాహ్నం ఒంటిగంటకు ఆరు వాహనాల్లో 30మంది అధికారులు రాగానే కార్యాలయంలోకి వెళ్లి తలుపులు మూశారు. ఎవరినీ బయటకు వెళ్లనీయకుండా సెల్ఫోన్లు స్వాధీనం చేసుకుని తనిఖీలు చేశారు.
బొల్లాపల్లి తహశీల్దార్ కార్యాలయంలో ఏసీబీ తనిఖీలు
ఇటీవల ఇచ్చిన పాసు పుస్తకాల మీద పరిశీలన చేస్తామన్నారు. ఇటీవల మేళ్లవాగు వీఆర్వోపై ఫిర్యాదులు వచ్చాయన్నారు. రికార్డులు అన్నీ క్షుణ్ణంగా పరిశీలించి బాధ్యులపై చర్యలు తీసుకుంటామని తెలిపారు. అధికారులు లంచం డిమాండ్ చేస్తే అవినీతిపై 14400కి ఫోన్ చేయాలని తప్పని సరిగా స్పందిస్తామని వివరించారు. తనిఖీల్లో ఏఎస్పీ వెంకట్రావు, డీఎస్పీ ప్రతాప్‌కుమార్, సీఐలు, సిబ్బంది పాల్గొన్నారు.
ఇదీ చదవండి: పదో తరగతి ప్రశ్నాపత్రాల లీక్.. ఘటనలపై ప్రభుత్వం సీరియస్