YuvaSakthi Program in Srikakulam : జనసేన అధినేత ఈనెల 12వ తేదీన శ్రీకాకుళం జిల్లా రణస్థలంలో యువశక్తి పేరుతో నిర్వహిస్తున్న భారీ బహిరంగ సభకు మద్దతుగా ఆ పార్టీ ఆధ్వర్యంలో విడయవాడలో ప్రచారం చేపట్టారు. జనసేన రాష్ట్ర అధికార ప్రతినిధి పోతిన వెంకట మహేష్ ఆధ్వర్యంలో ఇంటింటికి యువశక్తి అవగాహన కార్యక్రమం నిర్వహించారు. మూడు రోజులు పాటు విజయవాడలో నిర్వహించనున్న ఈ కార్యక్రమం మొదటి రోజున పశ్చిమ నియోజకవర్గం గొల్లపాలెం గట్టు ప్రాంతంలో యువశక్తి కరపత్రాలను పంచుతూ ఇంటింటికి తిరిగి వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు.
12న రణస్థలంలో పవన్‌కల్యాణ్ యువశక్తి.. విజయవాడలో ప్రచార కార్యక్రమం - జనసేన రాష్ట్ర అధికార ప్రతినిధి పోతిన వెంకట మహేష్
YuvaSakthi Program in Srikakulam : జనసేన అధినేత ఈనెల 12వ తేదీన శ్రీకాకుళం జిల్లా రణస్థలంలో యువశక్తి పేరుతో నిర్వహిస్తున్న భారీ బహిరంగ సభకు మద్దతుగా విజయవాడలో ప్రచారం చేపట్టారు. జనసేన రాష్ట్ర అధికార ప్రతినిధి పోతిన వెంకట మహేష్ ఆధ్వర్యంలో ఇంటింటికి యువశక్తి అవగాహన కార్యక్రమం నిర్వహించారు.
ఈ సందర్భంగా పోతిన వెంకట మహేష్ మాట్లాడుతూ రాబోయే రోజుల్లో రాజకీయాల్లో యువత ప్రధాన పాత్ర పోషిస్తారని, దానికి అనుగుణంగానే తమ అధినేత ఈ నెల 12వ తేదీ శ్రీకాకుళం జిల్లా రణస్థలంలో యువశక్తి పేరుతో భారీ బహిరంగ సభ నిర్వహిస్తున్నారని చెప్పారు. మూడు రోజులపాటు పశ్చిమ నియోజకవర్గంలో ఇంటింటికి తిరిగి యువశక్తి ప్రచార కార్యక్రమంతో పాటు స్థానిక ప్రజల సమస్యలను కూడా అడిగి తెలుసుకుంటున్నామని, త్వరలో ఈ నియోజకవర్గ మాజీ మంత్రి ఎమ్మెల్యే వెల్లంపల్లి శ్రీనివాసరావును ఇంటికి పంపించడం ఖాయమని ఈ సందర్భంగా ఆయన పేర్కొన్నారు.
ఇవీ చదవండి