Yuvagalam Jaitrayatra Vijayotsava Sabha Update:తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ చేపట్టిన 'యువగళం' పాదయాత్ర నేటితో 3 వేల కిలోమీటర్లు పూర్తి చేసుకుంది. ఈ సందర్భంగా లోకేశ్ కాకినాడ జిల్లా తుని మండలం రాజులకొత్తూరు వద్ద పైలాన్ ఆవిష్కరించారు. దీంతో పార్టీ కేంద్ర కార్యాలయం ఎన్టీఆర్ భవన్‌లో పార్టీ ముఖ్య నేతలు, శ్రేణులు పెద్ద ఎత్తున కేకులు కట్ చేశారు. అనంతరం యువగళం జైత్రయాత్ర విజయోత్సవ సభకు సంబంధించి పలు కీలక విషయాలను వెల్లడించారు.
Achchennaidu on Yuvagalam Vijayotsava Sabha:ఈ నెల 20వ తేదీన యువగళం జైత్రయాత్ర విజయోత్సవ సభను నిర్వహించబోతున్నామని తెలుగుదేశం పార్టీ రాష్ట్ర అధ్యక్షులు అచ్చెన్నాయుడు తెలిపారు. విజయనగరం జిల్లా భోగాపురం సమీప పోలేపల్లిలో విజయోత్సవ సభ జరుగుతుందని పేర్కొన్నారు. ఈ విజయోత్సవ సభకు తమ పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు, జనసేన అధినేత పవన్ కల్యాణ్, ఎమ్మెల్యే బాలకృష్ణ హాజరవుతారని వివరించారు. పొత్తు ప్రకటన తర్వాత తొలిసారిగా ఒకే వేదికపైకి చంద్రబాబు, పవన్, బాలకృష్ణ హాజరుకానుండడంతో ఇరుపార్టీల నేతలతోపాటు ప్రజలు ఆనందాన్ని వ్యక్తం చేస్తున్నారన్నారు. రాష్ట్ర నలుమూలల నుంచి లక్షలాది మంది ప్రజలు, యువత హాజరవుతారని అచ్చెన్నాయుడు వెల్లడించారు.
నిరుద్యోగులకు హామీ ఇస్తున్నాం-పెద్దఎత్తున పరిశ్రమలు తెస్తాం, ఉద్యోగాలు కల్పిస్తాం: నారా లోకేశ్
Achchennaidu Comments: ''విజయనగరం జిల్లా భోగాపురం మండలం పోలేపల్లి వద్ద భూమాత లేఅవుట్‌లో ఈ నెల 20న నారా లోకేశ్ యువగళం పాదయాత్ర ముగింపు సభ నిర్వహిస్తాం. ఈ సభ ద్వారా 2024 ఎన్నికల శంఖారావాన్ని పూరిస్తాం. భూమాత లేఅవుట్‌లో సంప్రదాయబద్దంగా ఈరోజు భూమిపూజ నిర్వహించాం. లోకేశ్ యువగళం పాదయాత్ర ముగింపు సభకు దాదాపు 5 లక్షలు మంది వస్తారని అంచనా వేస్తున్నాం. ఇప్పటికే 10 రైళ్లను బుక్ చేసుకున్నారు. ఈ సభకు నారా చంద్రబాబు నాయుడు, జనసేన పార్టీ అధ్యక్షులు పవన్ కల్యాణ్, బాలకృష్ణ, మరికొంతమంది ప్రధాన నాయకులు హాజరవుతారు. రానున్న ఎన్నికల్లో జనసేన, టీడీపీ నేతలు కలిసికట్టుగా పనిచేస్తాం. వైసీపీ ప్రభుత్వం వెంటిలేటర్‌పై ఉంది. రాబోయేది టీడీపీ, జనసేన ప్రభుత్వమే.'' అని అచ్చెన్నాయుడు అన్నారు.