YSRCP on Amaravati SC verdict: రాజధాని అమరావతి అంశంపై సుప్రీంకోర్టు వ్యాఖ్యలను స్వాగతిస్తున్నట్లు ప్రభుత్వం ప్రకటించింది. మూడు రాజధానులపై ప్రభుత్వ నిర్ణయం సహజన్యాయానికి అనుగుణంగా ఉందని ప్రభుత్వ సలహాదారు సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి పేర్కొన్నారు. వికేంద్రీకరణకు చట్టబద్ధత కల్పించాక వరుసగా జరిగిన ఎన్నికల్లో ప్రజలు వైసీపీని గెలిపించారని అన్నారు. మూడు రాజధానుల విషయంలో మిగిలిన అడ్డంకుల్ని సైతం అధిగమించి త్వరలోనే ముందుకెళ్తామని మంత్రి కాకాణి గోవర్దన్‌రెడ్డి స్పష్టం చేశారు. అమరావతిలో రైతుల భూముల అభివృద్ధిపై హైకోర్టు గతంలో నిర్దిష్ట కాలపరిమితి విధించిందని.. హైకోర్టు గతంలో ఇచ్చిన తీర్పుపై సుప్రీంకోర్టు ఈరోజు స్టే ఇచ్చిందని అన్నారు.
"సుప్రీంకోర్టు చేసిన వ్యాఖ్యలు ప్రభుత్వం చెప్తున్న మాటలే. వాటిని ఉన్నత న్యాయస్థానం స్పష్టం చేసింది. చిత్తశుద్ధి ఉంటే ఎక్కడ కూర్చోనైనా పాలన కొనసాగించవచ్చు. మూడు రాజధానుల అంశం ప్రభుత్వ విధానం.. దానిపైన పునరాలోచన లేదు. ఏమైనా మార్పులు చేర్పులుంటే ముఖ్యమంత్రి మంత్రి వర్గంతో చర్చించి తీసుకుంటారు. " - బొత్స సత్యనారాయణ, మంత్రి