YSRCP leader : ఎన్టీఆర్ జిల్లా కంచికచర్ల విద్యుత్ శాఖ కార్యాలయ సిబ్బందిపై వైకాపా నాయకుడు, 20 వవార్డు మెంబర్ దాడి చేశారు. ఇంటి విద్యుత్ బిల్లు కట్టమని సిబ్బంది అడగ్గా.. నన్నే బిల్లు కట్టమంటావా అని అసభ్య పదజాలంతో దూషించి.. సిబ్బందిపై దాడి చేశాడు. దీనిపై విద్యుత్ శాఖ అధికారులు పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. వైకాపా నాయకుడిపై చర్యలు తీసుకోవాలని విద్యుత్ శాఖ ఉన్నత అధికారులు.. పోలీసు అధికారులను కోరారు.
విద్యుత్ బిల్లు చెల్లించమన్నందుకు.. రెచ్చిపోయిన వైకాపా నాయకుడు - ఎన్టీఆర్ జిల్లా
YSRCP leader attack on Electricity Staff: అధికార పార్టీ నాయకుడైతే ఎవరినైనా కొట్టొచ్చా.. అధికారంలో ఉంటే ఎవరిపైనైనా దౌర్జన్యం చేయొచ్చా అని పలువురు ప్రశ్నిస్తున్నారు. విద్యుత్ బిల్లు చెల్లించమని అడిగినందుకు... నన్నే బిల్లు కట్టమంటావా అంటూ విద్యుత్ సిబ్బందిపై దాడి చేశాడో వార్డు మెంబర్. ఈ ఘటన ఎన్టీఆర్ జిల్లా కంచికచర్లలో జరిగింది.
YSRCP leader