YSRCP Government Not Paying Salaries to Ambulance Employees :108 వాహనాల ఉద్యోగుల సమస్యలు పరిష్కరిస్తానని ఉద్యోగ భద్రతకు ఢోకా లేకుండా చేస్తానని 2018 జనవరి 23న ప్రతిపక్ష నేతగా సూళ్లూరుపేటలో జగన్ హామీ ఇచ్చారు. అధికారంలోకి తానే వస్తానని అందరూ ధైర్యంగా ఉండాలని బీరాలు పలికారు. వైఎస్సార్సీపీ అధికారంలోకి వచ్చిన వెంటనే మీ ముఖాల్లో చిరునవ్వు కనిపించేలా చేస్తానంటూ 108 వాహనాల ఉద్యోగులకు హామీ ఇచ్చిన జగన్.. సీఎం అయ్యాక మాత్రం ముఖం చాటేశారు. అలవాటు ప్రకారం మడమ తిప్పేశారు. అవసరం తీరాక ఉద్యోగులకు కన్నీళ్లనే మిగిల్చారు. వారింకా ప్రైవేటు ఉద్యోగులుగా భారంగా విధులు నిర్వర్తిస్తున్నారు. నాడు జగన్ మాటలు నమ్మి ఎన్నో ఊహించుకున్నామని ఆయన అధికారాన్ని అనుభవించిన ఈ నాలుగున్నరేళ్ల కాలంలో ఉద్యోగ భద్రతే లేకుండా పోయిందని మనోవేదనతో తల్లడిల్లుతున్నారు.
CM Jagan Failed To Fulfill Promises to 108 Staff :గత ఒకటిన్నర దశాబ్దాలుగా 108 వాహనాల ఉద్యోగులుగా పనిచేస్తున్నవారికి వైఎస్సార్సీపీ పాలనలో నిర్ణీత తేదీకి జీతాలందిన పరిస్థితి లేదు. వివిధ ఘటనల్లో క్షతగాత్రులకు అత్యవసర చికిత్స అందించడంలో 108 వాహనాల ఉద్యోగులదే కీలక పాత్ర. అలాంటి వారి జీవితాలు వైఎస్సార్సీపీ పాలనలో చీకటిమయమయ్యాయి. తిండికి తిప్పలు పడాల్సిన పరిస్థితుల్లోకి జగన్ సర్కారు వారిని నెట్టేసింది. రెండు లేదా మూడు నెలల ఆలస్యంగా జీతాలిస్తోంది. అంతేకాదు.. ఏవేవో కారణాలతో వారిని ఉద్యోగాల్లోంచి తొలగిస్తోంది. నిరంతరం అభద్రతా భావంతో బతుకీడ్చేలా పరిస్థితిని తీసుకొచ్చింది.
ఈ నెల అయినా సకాలంలో జీతాలు పడతాయా..! ఉద్యోగుల్లో టెన్షన్
108 Ambulances Staff Situation in AP : ప్రభుత్వానికి సన్నిహితంగా ఉండే అరబిందో ఎమర్జెన్సీ మెడికల్ సర్వీసెస్ ద్వారా 108 అంబులెన్సులు 7 వందల 31 నడుస్తున్నాయి. వీటిల్లో సుమారు 3 వేల 500 మంది పైలెట్లు, ఎమర్జెన్సీ మెడికల్ టెక్నీషియన్లు పని చేస్తున్నారు. ప్రభుత్వ వ్యయంతో కొనుగోలు చేసిన అంబులెన్సులను అరబిందో సంస్థ నడుపుతోంది. దీని కోసం ప్రభుత్వం ఏటా 170 కోట్ల వరకు విడుదల చేస్తోంది. కానీ ప్రతి నెలా 108 ఉద్యోగులకు మాత్రం వేతనాలు అందడం లేదు. 12 నెలల్లో కనీసం 10 నెలలపాటు సకాలంలో ఇవ్వటం లేదు.