YSRCP Government Not Increasing Pension to Social Pensioners :ఆసరా పింఛన్లు 3 వేల రూపాయలకు పెంచుతామంటూ అధికారంలోకి వచ్చినసీఎం జగన్ మోహన్ రెడ్డి(CM Jagan Mohan Reddy).. ఇప్పటికీ ఆ మాట నిలుపుకోలేదు. ప్రభుత్వం ఇచ్చే పింఛన్ కోసం దివ్యాంగులు, వృద్ధులు, వితంతువులు కళ్లు కాయలుకాచేలా ఎదురు చూస్తున్నారు. నెల మొత్తం దాని పైనే ఆధారపడి జీవనం సాగిస్తున్నారు. కానీ పెరిగిన నిత్యావసరాల ధరలతో పోల్చితే వైసీపీ సర్కారు ఇచ్చే సాయం ఏ మూలకు సరిపోవడం లేదు. ఇంట్లో అర్హులు ఎంత మంది ఉన్నా.. ఒక్కరికే ప్రభుత్వ సాయం అందుతోంది. ఇంటి అద్దెలు, పిల్లల చదువులు, మందులకు డబ్బులు సరిపోక బతుకు భారంగా గడుపుతున్నామని వారు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
Social Pensioners Problems in AP :దేశంలో ఎక్కడా లేని విధంగా సామాజిక పింఛన్లు పెంచి వృద్ధులను, వికలాంగులను చేయి పట్టుకుని నడిపిస్తున్నామని ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి ఆర్భాటంగా ప్రచారం చేసుకుంటున్నారు. కానీ పెరిగిన ధరలతో పోల్చితే ప్రభుత్వం ఇచ్చే పింఛన్ సొమ్ములు ఏ మూలకు సరిపోవడం లేదు. 3 వేల రూపాయలకు పింఛన్ సొమ్ము పెంచుతామని సీఎం జగన్ మోహన్ రెడ్డి ఇచ్చిన మాట ఇప్పటికీ అమలు కాలేదు. దశల వారీ పెంపులో భాగంగా ఇప్పుడు ఇస్తున్న 2 వేల 750 రూపాయలు మందులకే సరిపోవడం లేదని వృద్ధులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
PRATHIDWANI: ప్రాణం తీసిన పిచ్చి, తలతిక్క నిబంధనలు
CM Jagan Comments on Increase Social Security Pension : ఎటూ కదల్లేని పరిస్థితిలో ఉన్న దివ్యాంగులపైనా ప్రభుత్వం కరుణ చూపడం లేదు. విభిన్న ప్రతిభావంతులకు ఉద్యోగాలు కల్పించడంలో జగన్ ప్రభుత్వం విఫలం అయింది. ఒంటరి మహిళల పరిస్థితి దయనీయంగా మారింది. సొంత ఇల్లు లేక అద్దెలు కట్టుకోలేక పస్తులు ఉండాల్సిన దుస్థితి ఏర్పడింది. ప్రభుత్వం ఇచ్చే సాయం సరిపోక.. కుటుంబపోషణ కష్టంగా మారిందని లబ్ధిదారులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.