YSRCP Government Diverted Central Funds :కేంద్ర ప్రభుత్వం 2018-19 సంవత్సరానికి కరవు సాయంగా 2019 మే నెలలో 900.40 కోట్లు విడుదల చేసింది. అదే సమయంలో ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన జగన్.. రైతులకు పెట్టుబడి రాయితీగా 2 వేల కోట్లను తమ ప్రభుత్వమే చెల్లిస్తుందని, ఆ మేరకు సంతకం చేసొచ్చానంటూ 2019 జులై 8న రైతు దినోత్సవంలో చెప్పారు.
కానీ నాలుగున్నరేళ్లు అవుతున్నా.. రైతులకు జగన్ ఇస్తానన్న 2వేల కోట్ల పెట్టుబడి రాయితీతో పాటు కేంద్రం ఇచ్చిన 900 కోట్ల కరవు సాయమూ రైతులకు అందలేదు. అంత పెద్ద మొత్తం ఏమయిందో.. ఎటు మళ్లించారో తెలియని పరిస్థితి. ధాన్యం కొనుగోలు సొమ్ముతో కలిపి రైతులకు 1.70 లక్షల కోట్ల సాయం చేశామంటూ పదేపదే చెప్పే ముఖ్యమంత్రి జగన్.. కేంద్రం నుంచి వచ్చిన సొమ్మును ఏం చేశారో కూడా చెబితే బాగుంటుందని విపక్షాలు, రైతు సంఘాలు డిమాండ్ చేస్తున్నాయి.
Diverted Panchayat Funds: ఇదేం సర్దు'పోటు' ?.. 5 నెలల్లో రూ.1,245 కోట్లు మళ్లింపు
Drought Zones Funds Diverted by Jagan Government :రాష్ట్రంలో 2018-19 ఖరీఫ్ కరవు కారణంగా రైతులు పెట్టుబడుల్ని నష్టపోయారు. అప్పటి ప్రభుత్వం 9 జిల్లాల్లో 347 కరవు మండలాలను ప్రకటించడంతో పాటు పెట్టుబడి రాయితీగా 1,869.19 కోట్లు ఇవ్వాలని నిర్ణయించింది. కేంద్ర బృందం సైతం కరవు తీవ్రతను పరిశీలించి నివేదిక ఇవ్వడంతో కేంద్రం 2019 మే నెలలో 900.40 కోట్లు విడుదల చేసింది. కరవు సాయానికి సంబంధించి కేంద్రం ఇచ్చే నివేదికలతో పాటు రాజ్యసభ, లోక్‌సభ ఇచ్చే సమాధానాల్లోనూ రాష్ట్రానికి 2018-19 సంవత్సరంలో 900.40 కోట్లు ఇచ్చామని పేర్కొంటోంది. ఆ మొత్తం ఇప్పటివరకు చేరకపోవడమే విచిత్రంగా ఉంది.