YSRCP Government Careless on Heart Patients :గుండె శస్త్రచికిత్సలకు రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చే నిధులు చాలడం లేదని చాలా ప్రైవేటు ఆస్పత్రులు గగ్గోలు పెడుతున్నాయి. గుండె శస్త్రచికిత్సల్లో పెద్దవారితో పోలిస్తే పిల్లలకు ఎక్కువ ఖర్చు అవుతుండడంతో వారికి ఆపరేషన్లు చేసేందుకు ఆసక్తి చూపడం లేదు. ప్రస్తుతానికి ఆయా ఆస్పత్రులు తప్పని పరిస్థితుల్లో గుండె ఆపరేషన్లు చేస్తున్నాల ఖర్చు తగ్గించుకోవడానికి వాడిన పరికరాల్నే పదేపదే వాడుతున్నాయి. ఇది కొన్ని సందర్భాల్లో రోగులకు ప్రాణసంకటంగా మారడంతో పాటు ఇతర అనారోగ్య సమస్యలకూ దారితీస్తోంది.
Heart Patients Conditions in Aarogyasri Due to Lack of Funds :కరోనరీ ఆర్టెరీ బైపాస్ గ్రాఫ్ట్ సామాన్య పరిభాషలో చెప్పాలంటే గుండెకు చేసే బైపాస్ ఆపరేషన్, ఆరోగ్యశ్రీ కింద ఈ ఆపరేషన్ చేయడానికి రాష్ట్ర ప్రభుత్వం లక్షా18 వేల 881 రూపాయలు ఇస్తోంది. ఇదే శస్త్రచికిత్సకు ఆయుష్మాన్ భారత్‌లో కేంద్రం లక్షా84వేల500 ఇస్తోంది. ఇది రాష్ట్రం ఇస్తున్నదానికంటే 55.20 శాతం అంటే 65 వేల 619 రూపాయలు ఎక్కువ. ఒక్క బైపాస్ సర్జరీనే కాదు ప్రతి ఆపరేషన్‌కు కేంద్రంతో పోలిస్తే రాష్ట్రం తక్కువ నిధులివ్వడం పేదలపాలిట శాపంగా మారింది. పెద్దలు, పిల్లల్లో ఎక్కువగా నిర్వహించే 43 రకాల గుండె ఆపరేషన్లకు సంబంధించి కేంద్రంతో పోలిస్తే రాష్ట్రం 10 నుంచి 200 శాతం వరకు అంటే 50 వేల నుంచి సుమారు 2 లక్షల వరకు తక్కువగా ఇస్తోంది.
ఆరోగ్య శ్రీ బిల్లుల చెల్లింపు ఆలస్యంపై స్పందించిన మంత్రి
గిట్టుబాటు కాదట్టున్న ప్రైవేటు ఆసుపత్రులు :పెద్దలు, పిల్లలు, శిశువుల్లో హృద్రోగ సమస్యలకు చేసే శస్త్ర చికిత్సల్లో 95శాతం వరకు బైపాస్, కవాటం మార్పిడి, పిల్లల గుండెలో రంధ్రం పూడ్చే ఆపరేషన్లే ఉంటాయి. పెద్దల్లో ఎక్కువగా బైపాస్ సర్జరీతో పాటు కవాటం మార్పిడి, కవాటం మరమ్మతు ఆపరేషన్లు ఎక్కువగా చేయాల్సి ఉంటుంది. ఇలాంటి పరిస్థితుల్లో పేదలు, మధ్యతరగతి వర్గాల ఆరోగ్యంపై ఎక్కువ దృష్టిపెట్టి, ఉదారంగా నిధులివ్వాల్సిన వైసీపీ ప్రభుత్వం దానికి భిన్నంగా వ్యవహరిస్తోంది. పెద్దల్లో కవాటం మార్పిడి, మరమ్మతు శస్త్రచికిత్సలకు కేంద్రం ఇస్తున్న ప్యాకేజీ కంటే రాష్ట్రం ఆరోగ్యశ్రీ కింద ఇస్తున్న ప్యాకేజీ లక్షా8 వేల నుంచి లక్షా11 వేల వరకు తక్కువ ఉంది. ఇంత తక్కువ మొత్తంలో శస్త్రచికిత్సలు చేయడం తమకు గిట్టుబాటు కాదని ప్రైవేటు ఆస్పత్రులు చెబుతున్నాయి.