ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

కాళ్లకు చక్రాలతో లక్ష్యాలు.. స్కేటింగ్ విన్యాసాలతో అబ్బురపరస్తున్న జంట

Young skaters: వాళ్ల ఆసక్తికి తోడు.. తల్లిదండ్రలు ప్రోత్సాహం తోడవడంతో.. జిల్లా, రాష్ట్ర, జాతీయ స్థాయిల్లో పథకాలు సాధించారు. వీరు కాళ్లకు రోలర్స్ కట్టుకొని గ్రౌండ్​లో దిగారంటే సెకెన్స్​లో ఆ గ్రౌండ్​ని చుట్టివస్తారు. జాతీయ స్థాయి రోలర్ స్కేటింగ్ క్రీడల్లో విజయవాడ నగరానికి చెందిన చైత్రదీపిక, కైవల్యలు మంచి ప్రతిభ కనబరుస్తున్నారు. భవిష్యత్‌లో అంతర్జాతీయ స్థాయిలో స్వర్ణం సాధిస్తామంటున్నారు ఈ యువ స్కేటర్స్.

skaters
యువ స్కేటర్స్

By

Published : Jan 1, 2023, 4:15 PM IST

Young skaters: జాతీయ స్థాయి రోలర్ స్కేటింగ్ క్రీడల్లో విజయవాడ నగరానికి చెందిన చైత్రదీపిక, కైవల్య స్వర్ణపథకాలు సాధించారు. వీరు కాళ్లకు రోలర్స్ కట్టుకొని గ్రౌండ్​లో దిగారంటే సెకెన్స్​లో ఆ గ్రౌండ్ ని చుట్టివస్తారు. వారు చేసే స్కేటింగ్ విధానం చూస్తే కళ్లు చెదిరిపోతాయి. ఇప్పటికే జిల్లా, రాష్ట్ర స్థాయిల్లో పలు పథకాలు సొంతం చేసుకున్న వీరు జాతీయ స్థాయిల్లోనూ పథకాలు సాధించారు. చిన్న నాటి నుంచే స్కేటింగ్ మీద ఉన్న ఆసక్తితో తల్లిదండ్రలు ప్రోత్సాహంతో ప్రస్తుతం మంచి ప్రతిభ కనబరుస్తున్నారు. వీరి ప్రతిభను గుర్తించిన పలువురు ప్రముఖులు వీరిని అభినందించారు. జాతీయ స్థాయి స్కేటింగ్ క్రీడల్లో స్వర్ణ, పథకాలతో పాటు మరిన్ని పథకాలు సాధించిన చైత్రదీపిక, కైవల్యపై ప్రత్యేక కథనం.

ఐదేళ్ల వయస్సు నుంచి శిక్షణ: విశాఖ జిల్లా నర్సీపట్నానికి చెందిన పెదిరెడ్ల రామసతీష్, లలితదేవి దంపతుల కుమార్తె చైత్రదీపిక నాలుగేళ్ల వయస్సు నుంచే స్కేటింగ్ క్రీడ మీద ఆసక్తి పెంచుకుంది. తండ్రి ఉద్యోగ రిత్యా విజయవాడలో స్థిరపడటంతో కృష్ణా జిల్లా తరుపున క్రీడల్లో ప్రాతినిధ్యం వహిస్తుంది. చైత్రదీపిక తల్లిదండ్రులు చిన్నప్పటి నుంచి ఆట స్థలాలకి తీసుకెళ్లే వారు.. అప్పుడే స్కేటింగ్ మీద ఆసక్తి పెంచుకున్న దీపిక స్కెటింగ్ నేర్చుకుంటానని తల్లి లలితతో చెప్పింది.. దీంతో తమ కుమార్తెకు స్కెటింగ్ నేర్పించాలనుకున్న తల్లిదండ్రులు విశాఖలో ఓ కోచ్ వద్ద శిక్షణ ఇప్పించారు. ఐదేళ్ల వయస్సు నుంచి స్కేటింగ్​లో శిక్షణ పొందుతూ.. రోజు రోజుకీ తన సామర్థ్యాన్ని దీపిక పెంచుకుంది.

జాతీయ స్థాయి పోటీల్లో స్వర్ణం: 2022 డిసెంబర్ 11 నుంచి 22 వరకు బెంగళూరులో జరిగిన జాతీయ స్థాయి పెయిర్ స్కేటింగ్ పోటీల్లో స్వర్ణ పథకాన్ని సొంతం చేసుకుంది. ప్రస్తుతం విజయవాడలోని సెయింట్ మాధ్యూస్ స్కూల్​లో ఏడో తరగతి చదువుతోంది. క్రీడలతో పాటు తమ కుమార్తె చదువుల్లోనూ రాణిస్తుందని చైత్రదీపిక తల్లిదండ్రులు చెబుతున్నారు. తమ కుమార్తె జాతీయ స్థాయి స్కేటింగ్ పోటీల్లో స్వర్ణం గెలుచుకోవడం తమకు సంతోషంగా ఉందన్నారు. రాష్ట్రం, దేశంలో ఎక్కడ స్కేటింగ్ క్రీడలు జరిగినా తన కుమార్తె చైత్రదీపికతో కలసి వెళతానని తండ్రి సతీశ్ చెబుతున్నారు. దీపిక తల్లి లలితి గృహిణిగా ఉంటూ నిరంతరం క్రీడల్లో పాటించాల్సిన జాగ్రత్తలు, మెళుకువల గురించి చెబుతుందని చైత్రదీపిక చెబుతుంది.

చదువుని ఎప్పుడూ నిర్లక్ష్యం చేయలేదు: విజయవాడ ఆటో నగర్​లో వ్యాపారిగా పని చేస్తున్న కొప్పరపు శశికుమార్, లలితాశ్రీవిద్యా దంపతుల కుమారుడు కైవల్య జాతీయ స్థాయి స్కేటింగ్ క్రీడల్లో పలు మార్లు స్వర్ణపథకాలు సాధించాడు. తండ్రి వ్యాపారిగా పని చేస్తుండగా తల్లి గృహిణిగా ఉంటుంది. 2022 డిసెంబర్ 11 నుంచి 22 వరకు బెంగళూరులో జరిగిన అరవయ్యో జాతీయ స్థాయి స్కేటింగ్ క్రీడల్లో చైత్రదీపిక, కైవల్య జట్టు పెయిర్ స్కేటింగ్​లో స్వర్ణం సొంతం చేసుకుంది. మూడేళ్ల వయస్సు నుంచే క్రీడల మీద తమ కుమారుడికి ఉన్న ఆసక్తిని గమనించిన తల్లిదండ్రలు స్కేటింగ్ నేర్పించాలనుకున్నారు. విశాఖలో స్కేటింగ్ క్రీడలకు శిక్షణ బాగుంటుందని భావించిన కైవల్య తల్లిదండ్రలు నెలకొక సారి విశాఖ తీసుకెళ్లి స్కేటింగ్ క్రీడలో శిక్షణ ఇప్పిస్తున్నారు. విజయవాడ ఎన్ఎస్ఎం పబ్లిక్ స్కూల్ లో ఎనిమిదో తరగతి చదువుతున్నాడు. భవిష్యత్తులో దేశం గర్వించదగ్గ క్రీడాకారుడిగా తయారవుతానని కైవల్య చెబుతున్నాడు. తాను చదువుల్లో ఫస్ట్, క్రీడల్లోనూ ఆ స్థాయిని చేరుకుంటానంటున్నాడు. క్రీడల్లో పడి చదువుని ఎప్పుడూ నిర్లక్ష్యం చేయలేదంటున్నాడు. జిల్లా, రాష్ట్ర స్థాయిలో స్కేటింగ్ పోటీల్లో పదుల సంఖ్యలో పలు పథకాలు సాధించాడు. జాతీయ స్థాయి క్రీడల్లోనూ 6స్వర్ణ పథకాలు సొంతం చేసుకున్నాడు. తన తల్లిదండ్రుల ప్రోత్సాహంతోనే నేను ఈ స్థాయికి చేరుకున్నానని కైవల్య అంటున్నాడు.

తాము క్రీడల్లో ఈ స్థాయిలో ఉండడానికి తల్లిదండ్రుల ప్రోత్సాహమే కారణమంటున్నారు. తమ తల్లిదండ్రులు తమను నిత్యమూ క్రీడల వైపు ప్రోత్సహిస్తారంటున్నారు... జాతీయ స్థాయి క్రీడల్లో పలు పథకాలు సొంతం చేసుకున్న చైత్రదీపిక, కైవల్యలు.... అంతర్జాతీయ క్రీడల్లోనూ రాణిస్తామని చెబుతున్నారు.

జాతీయ స్థాయిలో రాణిస్తున్న యువ స్కేటర్స్

ఇవీ చదవండి:

ABOUT THE AUTHOR

...view details