ప్రశ్నించిన యువకుడు..అది సర్పంచ్ చూసుకుంటారు: వైఎస్సార్సీపీ ఎమ్మెల్యే GADAPA GADAPA PROGRAM IN NTR: ఎన్టీఆర్ జిల్లా తిరువూరు మండలం పెద్దవరం గ్రామంలో గడపగడపకు ప్రభుత్వం కార్యక్రమంలో యువకుడు పల్లికంటి డేవిడ్.. ఎమ్మెల్యే రక్షణ నిధిని నిలదీశాడు. వైఎస్సార్సీపీ ప్రభుత్వం గ్రామంలో ఏం అభివృద్ధి చేసిందో చెప్పాలని ప్రశ్నించాడు.
యువకుడి ప్రశ్నలు:డ్రైనేజీ వ్యవస్థ గురించి ప్రశ్నించగా అది సర్పంచ్ చూసుకుంటాడని యువకుడికి ఎమ్మెల్యే బదులిచ్చారు. సీసీ రోడ్డు వేయలేదని ప్రశ్నించగా రోడ్డు వేశామన్నారు. ఇది గత ప్రభుత్వంలో వేశారని యువకుడు చెప్పాగా ఎప్పుడు వేసినా మేుము వేసినట్టేనని ఎమ్మెల్యే అనుచరులు అన్నారు.
తిరస్కరించిన యువకుడు:పక్కన ఉన్న అధికార పార్టీ నాయకులు పథకాల గురించి చెప్పే ప్రయత్నం చేయగా ఎమ్మెల్యే నాయకులను వారించారు. తమ ప్రభుత్వంలో ఏం చేశామో అరగంటలో వివరాలు ఇస్తామంటూ ఎమ్మెల్యే కరపత్రం ఇవ్వగా తీసుకునేందుకు యువకుడు నిరాకరించాడు. అదే సమయంలో అక్కడ వీడియో తీస్తున్న వారిపై ఎమ్మెల్యే అసహనం వ్యక్తం చేశారు. ఎమ్మెల్యే రక్షణనిధి పక్కకు వెళ్లిన తర్వాత తిరిగి ప్రభుత్వ పథకాలతో కూడిన కరపత్రం ఇచ్చేందుకు అధికార పార్టీ నాయకులు ప్రయత్నించగా తీసుకునేందుకు ఆ యువకుడు మరోసారి నిరాకరిస్తూ ఇంట్లోకి వెళ్లి పోయాడు.
ఇవీ చదవండి