ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

పూర్తి కాని ఎర్రకట్ట రహదారి, రైల్వే బ్రిడ్జ్ పనులు - PEOPLE FACING PROBLEMS AS THE RAILWAY BRIDGE

Cracks In Bridge On Yerra Katta: రాష్ట్రంలోని రహదారులను అందంగా తీర్చిదిద్దుతున్నామని గొప్పలు చెప్పుకుంటున్న ప్రభుత్వం....విజయవాడలోని ఎర్రకట్ట రహదారి, రైల్వే బ్రిడ్జ్ పనులు మాత్రం పూర్తి చేయడం లేదని స్థానికులు ఆవేదన వ్యక్తం చేశారు. బ్రిడ్జ్ పరిస్థితిపై మరింత సమాచారం మా ప్రతినిధి కనకారావు అందిస్తారు.

Yerra Katta Bridge
ఎర్రకట్ట రహదారి

By

Published : Jan 29, 2023, 9:08 PM IST

Cracks In Bridge On Yerra Katta: రాష్ట్రంలోని రహదారులను అందంగా తీర్చిదిద్దుతున్నామని గొప్పలు చెప్పుకుంటున్న రాష్ట్ర ప్రభుత్వం.. విజయవాడలోని ఎర్రకట్ట రహదారి, రైల్వే బ్రిడ్జ్ పనులు మాత్రం పూర్తి చేయడం లేదు. పాతబస్తీ ఎర్రకట్ట పై వంతెన మరమ్మతుల అంశంలో అటు విజయవాడ నగర పాలక అధికారులు, ఇటు రైల్వే అధికారులు పట్టనట్లు వ్యవహరిస్తున్నారు. రెండేళ్లకు ముందు ఈ రైల్వే వంతెన శిథిలావస్థకు చేరుకుందని ఈ రహదారిని రైల్వే అధికారులు మూసివేశారు. అయినా ఈ చుట్టు పక్కల ప్రాంతాల్లో నివసిస్తున్న ప్రజలు పంజా సెంటర్ రైల్వే స్టేషన్ వంటి ప్రాంతాలకు వెళ్లాలంటే ఈ దారిలోనే రాకపోకలు సాగిస్తున్నారు.

ప్రజలకు ఎలాంటి ప్రమాదం జరగకూడదని అధికారులు ఈ రహదారికి అడ్డంగా మట్టి, రాళ్లు వేసి మూసివేయడం సరి అయినది అయినా.. ప్రజలకు మరొక ప్రత్యమ్నాయం లేక ఆ మట్టిని దాటుకుంటూ వెళ్తున్నారు. ఈ బ్రిడ్జ్ క్రింద నుంచి ప్రయాణం ప్రమాదం అని తెలిసినా తప్పడం లేదని వాహనదారులు ఆవేదన చెందుతున్నారు. రాత్రి పూట ఈ రహదారిలో ప్రయాణించడం ప్రమాదమంటున్నారు. పక్కనే ఉండే ప్రాంతాలకు ఇతర రహదారుల నుంచి వెళ్లాలంటే అదనంగా రెండు కిలోమీటర్లు ప్రయాణం చేయాలని వాపోతున్నారు.

గత్యంతరం లేక ఈ రహదారిలో ప్రయాణిస్తున్నామని చెబుతున్నారు. నిత్యం వేలాది వాహనాలు రాకపోకలు సాగిస్తున్న ఎర్రకట్ట వంతెన శిథిలావస్థకు చేరుకున్నా ప్రభుత్వం, అధికారులు పట్టించుకోవడం లేదని స్థానికులు ఆగ్రహం చేస్తున్నారు. ఎర్రకట్ట రహదారి, శిథిలావస్థకు చేరుకున్న బ్రిడ్జ్ పై మరింత సమాచారం మా ప్రతినిధి కనకారావు అందిస్తారు.

ప్రభుత్వం తక్షణమే స్పందించి బ్రిడ్జి పనులు పూర్తిచేయాలని స్థానికుల విజ్ఞప్తి

ఇవీ చదవండి

ABOUT THE AUTHOR

...view details