ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

పవన్‌ సేవా కార్యక్రమాలు, పర్యటనలు చూసి వైసీపీ టార్గెట్‌ చేసింది: పోతిన మహేశ్

All state politics revolves around Pawan kalyan: 2022 సంవత్సరం పవన్ కల్యాణ్ నామ సంవత్సరంగా సాగిందని... జనసేన అధికార ప్రతినిధి పోతిన మహేశ్ అన్నారు. ఈ ఏడాది మొత్తం రాష్ట్ర రాజకీయాలన్నీ పవన్ చుట్టూనే తిరిగాయన్నారు. పవన్‌ సేవా కార్యక్రమాలు, పర్యటనలు చూసి... సీఎం జగన్‌తో సహా వైసీపీ నేతలందరూ టార్గెట్ చేశారన్నారు.

All state politics revolves around Pawan kalyan
పవన్‌ సేవా కార్యక్రమాలు, పర్యటనలు చూసి వైసీపీ టార్గెట్‌ చేసింది: పోతిన మహేశ్

By

Published : Dec 31, 2022, 10:40 PM IST

All state politics revolves around Pawan kalyan: 2022వ సంవత్సరం పవన్ కల్యాణ్ జనసేన నామ సంవత్సరంగా సాగిందని జనసేన పార్టీ అధికార ప్రతినిధి పోతిన మహేష్ అన్నారు.ఒక రాజకీయ నాయకుడిగా ఒక ఆపద్బాంధవుడిగా ఒక సామాజిక సంస్కర్తగా ఒక ప్రతిపక్ష నాయకుడిగా 100 శాతం బాధ్యతలు నిర్వహించిన ఏకైక రాజకీయ నాయకుడు పవన్ కల్యాణ్ అన్నారు. రాష్ట్ర రాజకీయాలన్నీ పవన్ కల్యాణ్ చుట్టూనే తిరిగాయన్నారు.

సీఎం జగన్‌తో సహా వైసీపీ నేతలందరూ పదే పదే పవన్ కల్యాణ్ని టార్గెట్ చేశారంటే ఆయన ప్రజల సమస్యలపై ఎంత బలంగా పనిచేశారో వైసీపీ నాయకులకు అర్థమైందన్నారు. జనసేన పార్టీ ఆవిర్భావ సభతో రాష్ట్ర రాజకీయాల్లో ప్రకంపనలు, మత్స్యకార భరోసా సభ, ఇప్పటం ఇలా అనేక అంశాలపై నిరంతరం పోరాడిన వ్యక్తి పవన్ కల్యాణ్ అన్నారు. పవన్ కల్యాణ్ కేంద్రంగానే రాష్ట్ర రాజకీయాలు నడుస్తున్నాయి అంటే అతిశయోక్తి లేదన్నారు. వైసీపీ ముక్త ఆంధ్రప్రదేశ్ తద్యం రాష్ట్ర భవిష్యత్తు అభివృద్ధి ప్రజా సంక్షేమం జనసేన పార్టీ అధ్యక్షులు పవన్ కల్యాణ్​తోనే అవుతుందన్నారు.

ఇవీ చదవండి:

ABOUT THE AUTHOR

...view details