Yuvagalam Padayatra: చిత్తూరు జిల్లా కుప్పంలో ఈ నెల 27న టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ యువగళం పాదయాత్రను వైసీపీ అడ్డుకోవాలని చూస్తోందంటూ తెలుగుదేశం పార్టీ ఆరోపించింది. ఈ మేరకు వైసీపీ వాట్సాప్ గ్రూప్ మెసేజ్లను టీడీపీ బయటపెట్టింది. పాదయాత్ర అడ్డుకోవడం, దాడులకు సిద్ధం కావాలి అంటూ కార్యకర్తలకు వైసీపీ మెసేజ్‌లు పంపింది. లోకేష్ పాదయాత్రను అడ్డుకుంటామని వైసీపీ నేత, మండల మాజీ అధ్యక్షుడు, ఎంపీపీ భర్త కోదండరెడ్డి ఒక ప్రకటన విడుదల చేశాడు. ఈ ప్రకటన సామాజిక మాద్యమాల్లో హల్చల్ చేస్తోంది. మరోవైపు ఇటీవల కుప్పంలో పర్యటించిన ఎంపీ మిధున్ రెడ్డి మీడియాతో మాట్లాడుతూ పాదయాత్రలు ఎవరైనా చేసుకోవచ్చు అని, లోకేష్ పాదయాత్రకు ఎలాంటి అభ్యంతరం లేదని స్పష్టం చేశారు.
వైసీపీ కుట్ర బట్టబయలు... యువగళం యాత్రను అడ్డుకోవాలని వాట్సాప్లో మెసేజ్‌లు - Yuvagalam Padayatra in Kuppam
Yuvagalam Padayatra: కుప్పంలో టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ యువగళం పాదయాత్రను వైసీపీ అడ్డుకోవాలని చూస్తోందంటూ తెలుగుదేశం పార్టీ ఆరోపించింది. ఈ మేరకు వైసీపీ వాట్సాప్ గ్రూప్ మెసేజ్లను తెదేపా బయటపెట్టింది. ఈ రెచ్చగొట్టే మెసేజ్ లు సామాజిక మాధ్యమాల్లో వైరల్‌గా మారాయి.
Yuvagalam Padayatra