ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

YCP Government Did Not Give Toor Dal in October: కందిపప్పు కోత.. రూ.856కోట్లు మిగుల్చుకున్న ప్రభుత్వం - Ration mafia in AP

YCP Government Did Not Give Toor Dal in October: జగన్‌ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక పండగల సమయంలోనూ కిలో కందిపప్పు ఇవ్వలేని దుస్థితి నెలకొంది. పండగ కానుకలు ఎలాగూ ఎత్తేశారు. కనీసం రేషన్ సరకులైనా సక్రమంగా ఇవ్వండన్న వేడుకోలు పట్టించుకునేవారు లేరని పేదలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ప్రతిపక్షంలో ఉన్నప్పుడు జగన్‌ చెప్పిన మాటలను గుర్తు చేసుకుని నవ్వుకుంటున్నారు.

YCP_Government_Did_Not_Give_Toor_Dal_in_October
YCP_Government_Did_Not_Give_Toor_Dal_in_October

By ETV Bharat Andhra Pradesh Team

Published : Oct 11, 2023, 9:43 AM IST

YCP Government Did Not Give Toor Dal in October: కందిపప్పు కోత.. రూ.856కోట్లు మిగిల్చుకున్న ప్రభుత్వం

YCP Government Did Not Give Toor Dal in October :ముఖ్యమంత్రి జగన్‌ 2019 ఎన్నికల ముందు ప్రతిపక్ష నాయకుడి హోదాలో పాదయాత్ర చేస్తూ.. రేషన్ దుకాణాల్లో నిత్యావసర సరకులే దొరకడం లేదంటూ ఆరోపించారు. వైఎస్సార్సీపీ పాలనలో పరిస్థితి మార్చేస్తామని హామీలు ఇచ్చారు. వాస్తవానికి టీడీపీ ప్రభుత్వ హయాంలో పౌర సరఫరాల దుకాణాల్లో కేజీ 40 రూపాయల చొప్పున రెండు కేజీల కందిపప్పు ఇస్తే.. జగన్ సీఎం అయ్యాక కిలోకు 27 రూపాయలు పెంచి, 67 రూపాయల చొప్పున పంపిణీ చేశారు. పైగా ఈ ఏడాదిలో జనవరి నుంచి క్రమంగా పంపిణీ తగ్గిస్తూ వచ్చారు. అదికాస్త జులై నుంచి నామమాత్రంగా మారింది. దసరా పండగ నేపథ్యంలో ఈ అక్టోబరులోనైనా కందిపప్పు ఇస్తారని ఆశిస్తే అదీ లేనట్లేనని పౌర సరఫరాల శాఖ తేల్చేసింది.
Huge Cuts in Ration After Jagan Government in AP :గిరిజన ప్రాంతాల కార్డుదారులకు అక్టోబరు నెలలో కందిపప్పు (kandipappu) ఇస్తామన్న హామీ సైతం మొక్కుబడి చందంగా మారింది. ఫలితంగా పేద ప్రజలు బహిరంగ మార్కెట్‌లో కిలో కందిపప్పు 190 రూపాయలకు కొనుక్కోవాల్సి వస్తోంది. వైసీపీ సర్కారు కార్డుదారుల కష్టాలను పట్టించుకోకపోగా.. ఒక నెల పంపిణీ చేయకపోతే ఆ మేరకు డబ్బులు మిగిలిపోతాయన్నట్లు వ్యవహరిస్తోంది. ప్రభుత్వానికి చిత్తశుద్ధి ఉంటే ముందే టెండర్లు పిలిచి కందిపప్పు నిల్వలను సిద్ధం చేసేది. కానీ ప్రభుత్వం ఏవేవో సాకులతో కందిపప్పు కోత పెట్టి పేదలను గాలికి వదిలేసింది.

కేంద్రం ఇచ్చే బియ్యానికి అడ్డెందుకు..5నెలల బియ్యాన్ని నిలిపేసిన ప్రభుత్వం

కందిపప్పు మార్కెట్ ధర కిలో ప్రస్తుతం 190 రూపాయలు ఉండగా, కార్డుదారులకు 123 రూపాయల ప్రభుత్వ రాయితీతో 67 రూపాయల చొప్పున పంపిణీ చేస్తున్నారు. ఈ లెక్కన రేషన్‌లో కందిపప్పు కోత ద్వారా జనవరి నుంచి ఇప్పటివరకు ధరల హెచ్చుతగ్గులను పరిగణనలోకి తీసుకుంటే సగటున కిలోకు 100 రూపాయల చొప్పున ప్రభుత్వం 856 కోట్లు మిగుల్చుకుంది. అంటే అంత మొత్తం ఆర్థిక భారం కార్డుదారులపై పడినట్లే లెక్క.

Beneficiaries Waiting for Ration Goods: రేషన్ సరుకులు కావాలంటే..కూలి పనులు మానుకోవాల్సిందే: లబ్ధిదారులు
రాష్ట్రంలో మొత్తం కోటీ46లక్షల 14వేల రేషన్ కార్డులు ఉన్నాయి. అందులో కార్డుకు కిలో చొప్పున 14వేల 614 కేజీల కందిపప్పు పంపిణీ చేయాల్సి ఉంది. జనవరి నుంచి అక్టోబరు వరకు లక్షా31వేల 526 టన్నులు పంపిణీ చేయాల్సి ఉండగా కనీసం 90 శాతం కార్డులకు కందిపప్పు సరఫరా చేసినా లక్షా18వేల373 టన్నులు పడుతుంది. అయితే 9 నెలల్లో వైసీపీ ప్రభుత్వం పంపిణీ చేసింది కేవలం 32వేల732 టన్నులు మాత్రమే.

2023 జనవరి నెలలో మొత్తం 6వేల893 టన్నుల కందిపప్పును కార్డుదారులకు అందించగా అది 47.17 శాతంగా ఉంది. అక్టోబరు 9వ తేదీ నాటికి చూసుకుంటే 0.66శాతంతో 97టన్నులు మాత్రమే పంపిణీ చేశారు. మొత్తం 85వేల 614 టన్నుల కందిపప్పు కోతపెట్టిన ప్రభుత్వం రాయితీ రూపంలో 856కోట్లు మిగుల్చుకుంది.

Massive Cut in kandipappu Distribution in AP :రాష్ట్రంలో మే నెల నుంచి కందిపప్పు పంపిణీలో భారీగా కోత పడింది. సాధారణంగా మొత్తం కార్డుదారుల్లో 90శాతం మంది నిత్యావసరాలు తీసుకుంటారు. కానీ, ఈ ఏడాది జనవరి నుంచి 50శాతం కార్డుదారులకూ కందిపప్పు ఇవ్వలేదు. జులై, ఆగస్టు, సెప్టెంబరులో బాగా తగ్గింది. గత 9 నెలల్లో మొత్తం 85 వేల టన్నులు పైగా కోత పెట్టారు. ఇలా ఎందుకు కోత విధిస్తున్నారనే దానిపై ప్రభుత్వం నుంచి స్పష్టమైన ప్రకటన లేదు. దీంతో మీరే ఇవ్వడం లేదంటూ కొన్నిచోట్ల M.D.U. వాహనదారులు, రేషన్ డీలర్లతో జనం గొడవ పడుతున్నారు.

గత ప్రభుత్వ హయాంలో కిలో 40రూపాయల చొప్పున 2 కిలోల కందిపప్పు ఇచ్చేవారు. ప్రస్తుత ధర ప్రకారం చూస్తే దాని విలువ 380 రూపాయలు ఉంటుంది. వైసీపీ సర్కారు పంపిణీని కిలోకు తగ్గించినా.. అదీ ఇవ్వకపోవడం లేదు.

Ration mafia in AP: వైసీపీ నాయకుల రేషన్ మాఫియా.. ఎక్కడ పట్టుబడ్డా కేరాఫ్ కాకినాడే

ABOUT THE AUTHOR

...view details