Yanamala Rama Krishnudu: అమరావతి రైతుల పాదయాత్రకు అన్ని ప్రాంతాల నుంచి వస్తున్న స్పందన చూసి.. ఎలాగైనా అడ్డుకోవడానికి వైకాపా ప్రభుత్వం చేయని కుట్ర లేదని శాసన మండలి ప్రధాన ప్రతిపక్ష నేత యనమల రామకృష్ణుడు ధ్వజమెత్తారు. సీఎం జగన్‌కు అమరావతి అంటే ఎందుకంత కక్ష.. అని ప్రశ్నించారు. మూడు రాజధానుల గురించి మాట్లాడే హక్కు వైకాపా శాసనసభ్యులకు లేదన్నారు. హైకోర్టు ఆర్డర్ ఉనికిలో ఉన్నప్పుడు మూడు రాజధానుల గురించి ఎలా మాట్లాడతారని నిలదీశారు. సీఎం జగన్ కోర్టు దిక్కరణకు పాల్పడుతున్నారన్నారు. ఉత్తరాంధ్ర ప్రజలు కార్యనిర్వాహక రాజధానిని కోరడం లేదని స్పష్టం చేశారు. ప్రాంతాల మధ్య విధ్వేషాలు రెచ్చగొట్టి రాజకీయ లబ్ది కోసం ఆరాటపడుతున్నారని దుయ్యబట్టారు. జగన్ క్రూరమైన ప్రచారాన్ని ఆపాలన్న యనమల అమరావతిని రాజధానిగా కొనసాగించి ఆంధ్రప్రదేశ్‌ను కాపాడాలని కోరారు.
సీఎం జగన్‌కు అమరావతి అంటే ఎందుకంత కక్ష..!: యనమల - ప్రతిపక్ష నేత
YANAMALA: అమరావతి రాజధానిపై ముఖ్యమంత్రికి కక్ష ఎందుకు అని శాసనమండలి ప్రతిపక్ష నేత యనమల రామకృష్ణుడు ప్రశ్నించారు. అమరావతి రైతుల పాదయాత్రకు అన్ని ప్రాంతాల నుంచి వస్తున్న స్పందనను చూసి.. అడ్డుకోవడానికి ప్రభుత్వం కుట్ర చేస్తోందని ఆయన అన్నారు.
![సీఎం జగన్‌కు అమరావతి అంటే ఎందుకంత కక్ష..!: యనమల యనమల రామకృష్ణుడు](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-16749273-905-16749273-1666777442399.jpg)
Yanamala Rama Krishnudu