Yanamala Comments on YS Jagan: అవినీతి వద్దని అవినీతిపరుడే చెప్పడం హాస్యాస్పదమని టీడీపీ శాసనమండలి ప్రతిపక్షనేత యనమల రామకృష్ణుడు అన్నారు. ఇక నుండి అవినీతికి వీల్లేదనడమంటే.. గత 42 నెలలుగా అవినీతికి గేట్లు తెరిచినట్లేనా అని ప్రశ్నించారు. కామెడిలో ఛార్లీ చాప్లిన్తో పోటీ పడేందుకు ప్రయత్నిస్తున్నట్లు జగన్ రెడ్డి వ్యాఖ్యలు ఉన్నాయని ఎద్దేవా చేశారు.
'ల్యాండ్ శాండ్ వైన్ మైన్' పేరుతో దోపిడీ: యనమల రామకృష్ణుడు - NTR district latest news
Yanamala Comments on YS Jagan: అవినీతిపరుడే అవినీతి వద్దని చెప్పడం హాస్యాస్పదమని టీడీపీ శాసనమండలి ప్రతిపక్షనేత యనమల రామకృష్ణుడు ఎద్దేవా చేశారు. దేశంలోనే అంత్యంత అవినీతిమయమైన రాష్ట్రంగా ఏపీని జగన్మోహన్ రెడ్డి తీర్చిదిద్దారని విమర్శించారు. మూడున్నరేళ్లలో అక్రమ మైనింగ్‌లో రాష్ట్రం దేశంలోనే మూడో స్థానంలో ఉందని ఆరోపించారు. ల్యాండ్-శాండ్-వైన్-మైన్ పేరుతో రాష్ట్రాన్ని దోపిడి చేశారని ఆయన అన్నారు.
!['ల్యాండ్ శాండ్ వైన్ మైన్' పేరుతో దోపిడీ: యనమల రామకృష్ణుడు Yanamala Ramakrishna](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-17214748-972-17214748-1671102594521.jpg)
24 సీబీఐ, ఈడీ ఛార్జిషీట్లు, 16 నెలల జైలు శిక్ష అనుభవించిన అవినీతి చరిత్ర జగన్ రెడ్డిదని అన్నారు. మూడున్నరేళ్లుగా ల్యాండ్-శాండ్-వైన్-మైన్ దోపిడీతో రాష్ట్రాన్ని మొత్తాన్ని స్వాహా చేశారని యనమల ఆరోపించారు. దేశంలోనే అత్యంత అవినీతిమయమైన రాష్ట్రంగా ఏపీని జగన్ రెడ్డి తీర్చిదిద్దారన్నారు. మూడున్నరేళ్లలో అక్రమ మైనింగ్‌లో ఏపీ దేశంలోనే మూడో స్థానంలో ఉందని అన్నారు. లేటరైట్ పేరుతో బాక్సైట్ నుండి.. రుషికొండకు బోడిగుండు వరకు అక్రమ మైనింగ్ చేశారన్నారు. మద్య నిషేధం పేరుతో అక్రమ మద్యం వ్యాపారంతో 30వేల కోట్లు స్వాహా చేశారని ఆరోపించారు. రాజధాని పేరుతో రూ.40వేల కోట్ల విలువైన భూములు బొక్కేశారన్నారు. జగన్ రెడ్డి అవినీతి వద్దనే కామెడీలు చేయడం మాని.. రాష్ట్రాభివృద్ధి గురించి ఆలోచించాలని యనమల రామకృష్ణుడు హితవు పలికారు.
ఇవీ చదవండి: