World Telugu Conference: విజయవాడ వేదికగా నేడు ఐదో ప్రపంచ తెలుగు రచయితల మహాసభలు ప్రారంభం కానున్నాయి. "స్వభాషను రక్షించుకుందాం.. స్వాభిమానం పెంచుకుందాం" అనే నినాదంతో ఈ సభలు నిర్వహిస్తున్నారు. రెండు రోజులపాటు జరిగే మహాసభల్లో.. 15 వందల మందికి పైగా సాహితీ ప్రముఖులు, భాషాభిమానులు పాల్గొననున్నారు. తెలుగును కాపాడుకోవాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉందని ఎలుగెత్తి చాటేందుకు.. దేశవిదేశాల నుంచి రచయితలు, కవులు, సాహితీవేత్తలు తరలివస్తున్నారు. నాలుగేళ్లకోసారి మహాసభలు నిర్వహిస్తున్న ఈ మహాసభలు. 2007లో ప్రారంభమవగా... 2011, 2015, 2019లో జరిగాయి. ఐదో సభల కోసం సిద్ధార్థ కళాశాల ప్రాంగణాన్ని తెలుగు భాష, సంస్కృతులు ఉట్టిపడేలా తీర్చిదిద్దారు. తెలుగు భాషాభివృద్ధికి విశేషంగా కృషి చేసిన రాజరాజ నరేంద్రుడి పేరును ఈ ప్రాంగణానికి పెట్టారు. మూడు వేదికలకు ఆదికవి నన్నయ, పి.వి.నరసింహారావు, ఎన్టీఆర్ పేర్లు ఖరారు చేశారు. భాషాభివృద్ధికి కృషి చేసిన మహనీయులు చిరస్థాయిగా జనం గుండెల్లో నిలిచిపోతారని చాటడానికే.. ఈ పేర్లు పెట్టినట్టు ప్రపంచ తెలుగు రచయితల సంఘం కార్యదర్శి జి.వి.పూర్ణచందు తెలిపారు.
విజయవాడ వేదికగా నేటి నుంచి ప్రపంచ తెలుగు మహాసభలు - ఆంధ్రప్రదేశ్ తాజా వార్తలు
World Telugu Conference: "స్వభాషను రక్షించుకుందాం.. స్వాభిమానం పెంచుకుందాం" అనే నినాదంతో ఐదో ప్రపంచ తెలుగు రచయితల మహాసభలు ప్రారంభం కానున్నాయి. 15 వందల మందికి పైగా సాహితీ ప్రముఖులు, భాషాభిమానులు పాల్గొనే ఈ సభలు విజయవాడ వేదికగా నిర్వహిస్తున్నారు.
![విజయవాడ వేదికగా నేటి నుంచి ప్రపంచ తెలుగు మహాసభలు World Telugu conference](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-17286546-894-17286546-1671770369966.jpg)
ప్రపంచ తెలుగు మహాసభలు
ప్రపంచ తెలుగు రచయితల సంఘం కార్యదర్శి జి.వి.పూర్ణచందు