Woman Gave Birth to Three Babies : ఒకే కాన్పులో.. ముగ్గురు పిల్లలకు జన్మనిచ్చిన ఘటన ఎన్టీఆర్ జిల్లాలో చోటుచేసుకుంది. నందిగామకు చెందిన షేక్ అమీనా ఒకే కాన్పులో ఇద్దరు మగపిల్లలు, ఒక ఆడ శిశువుకు జన్మనిచ్చింది. ప్రసవ నొప్పులతో వచ్చిన అమీనాకి ఉచితంగా సర్జరీ చేశామని పద్మశ్రీ హాస్పిటల్ వైద్యులు తెలిపారు. ఒకే కాన్పులో ముగ్గురు పిల్లలు జన్మించటంతో.. కుటుంబ సభ్యులు సంతోషం వ్యక్తం చేశారు. పలువురు ప్రముఖులు ఆ తల్లి, పిల్లలను సందర్శించి శుభాకాంక్షలు తెలిపారు. ముగ్గురు పిల్లలను స్థానిక పూజిత పిల్లల వైద్యశాలలోని ఇంక్యూబెటర్లో ఉంచామని వైద్యులు తెలిపారు. పిల్లల ఆరోగ్య పరిస్థితిని ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తున్నట్లు వెల్లడించారు.
ఒకే కాన్పులో ముగ్గురు పిల్లలకు జన్మనిచ్చిన మహిళ.. - ఎన్టీఆర్ జిల్లా తాజా వార్తలు
Woman Gave Birth to Three Babies In NTR District : ఓ మహిళ ఒకే కాన్పులో ముగ్గురు పిల్లలకు జన్మనిచ్చిన ఘటన ఎన్టీఆర్ జిల్లాలో జరిగింది. ఒకేసారి ముగ్గురు పిల్లలు తమ కుటుంబంలోకి రావటంతో ఆ దంపతులు ఆనందం వ్యక్తం చేశారు.
![ఒకే కాన్పులో ముగ్గురు పిల్లలకు జన్మనిచ్చిన మహిళ.. Woman Gave Birth to Three Babies In NTR District](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-17019198-175-17019198-1669286332467.jpg)
Woman Gave Birth to Three Babies In NTR District
ఒకే కాన్పులో ముగ్గురు పిల్లలకు జన్మనిచ్చిన మహిళ
Last Updated : Nov 24, 2022, 4:40 PM IST