Woman Fight The Thief : ఓ ఆగంతుకుడు తన మెడలో ఉన్న మంగళసూత్రాన్ని దొంగిలించాలని ప్రయత్నించినా.. కత్తిపోట్లు భార్యాభర్తలను బాధిస్తున్నా.. ఓ మహిళ తన భర్తతో కలిసి దొంగకు ఎదురు తిరిగింది. నెత్తురు చిందినా మంగళసూత్రాన్ని కాపాడుకుంది. తెలంగాణలోని సికింద్రాబాద్ జీఆర్పీ పోలీస్‌స్టేషన్ పరిధిలో ఈ నెల 16న జరిగిన ఘటన.. ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. నిజామాబాద్‌కు చెందిన అశోక్, కనకలక్ష్మి హైదరాబాద్ బోరబండలో అనారోగ్యంతో ఉన్న బంధువును పరామర్శించేందుకు రోటేగావ్ కాచిగూడ ఎక్స్‌ప్రెస్ రైలులో వచ్చారు.
మంగళసూత్రం కోసం దొంగతో మహిళ ఫైట్.. కత్తిపోట్లనూ లెక్క చేయకుండా - దొంగతో మహిళ ఫైట్
Woman Fight The Thief : మహిళలు ఎంతో పవిత్రంగా, జాగ్రత్తగా కాపాడుకునే మంగళసూత్రాన్ని ఓ దొంగ తెంచేయాలని చూశాడు. దీంతో ఆమె దొంగతో పోరాడి మరీ తన మంగళసూత్రాన్ని కాపాడుకుంది. సీతాఫల్‌మండి రైల్వేస్టేషన్లో జరిగిన ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది.
సీతాఫల్‌మండి రైల్వేస్టేషన్ సమీపంలో సిగ్నల్ కోసం రైలు ఆగింది. అప్పటికే రైల్లో వేచి ఉన్న ఆగంతుకుడు కనకలక్ష్మి మెడలోని 3 తులాల బంగారుగొలుసు లాక్కొని పారిపోయేందుకు యత్నించాడు. ఉలిక్కిపడిన దంపతులు తేరుకొని దొంగను పట్టుకుని కేకలు వేశారు. అతడి చేతిలోని గొలుసును తీసుకునేందుకు పెనుగులాడారు. దుండగుడు కత్తితో దాడి చేసి అశోక్‌ను తీవ్రంగా గాయపరిచాడు. ఆమెను గట్టిగా నెట్టడంతో కిందపడి గాయాల పాలైంది. ప్రయాణికులు స్పందించడంతో దొంగ ఉడాయించాడు. సీతాఫల్‌మండి రైల్వే పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. బంగారం కాపాడుకోవడానికి దంపతులు చూపిన తెగువను అందరూ ప్రశంసించారు.
ఇవీ చదవండి: