ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

"మీ వ్యాపారం కోసం.. మా యంత్రాలు".. స్ఫూర్తిదాయకంగా విజయవాడ మహిళా పారిశ్రామికవేత్త విజయగాథ

Woman Entrepreneur Palakurthi Bhramaramba Success Story: వ్యాపారం అంటే చిన్నాచితక విషయం కాదు. లాభ, నష్టాలతో కూడుకున్న ఈ వ్యాపారంలో ఎంతో జాగ్రత్తగా ఉండాలి. లాభాలు వచ్చినప్పుడు ఎంత ఆనందంగా ఉంటామో.. అలానే నష్టాలు వచ్చినప్పుడు కూడా కుంగిపోకుండా వాటిని అధిగమించి లాభాల బాట పట్టేలా కష్టపడాలి. తాజాగా ఓ మహిళ పారిశ్రామికవేత్త కూడా తమ వ్యాపారంలో వచ్చిన ఒడిదుడుకులను తట్టుకుని కొత్తదారిలో ప్రయాణిస్తూనే.. మరెంతో మందిని వ్యాపార రంగంలో నిలదొక్కుకునేలా చేస్తున్నారు. మీకోసం ఆమె సక్సెస్​ స్టోరీ..

Woman_Entrepreneur_Palakurthi_Bhramaramba
Woman_Entrepreneur_Palakurthi_Bhramaramba

By

Published : Aug 21, 2023, 2:14 PM IST

Woman_Entrepreneur_Palakurthi_Bhramaramba: స్ఫూర్తిదాయకంగా విజయవాడ మహిళా పారిశ్రామికవేత్త విజయగాథ

Woman Entrepreneur Palakurthi Bhramaramba Success Story: వ్యాపారం ప్రారంభంలో ఒడిదొడుకులు సాధారణం. కానీ విజయవంతంగా సాగుతూ.. ఒక్కసారిగా కుప్పకూలితే.. అలాంటి పరిస్థితినే చూశారు విజయవాడకు చెందిన పాలకుర్తి భ్రమరాంబ. ఒడిదొడుకులను తట్టుకుని కొత్తదారిలో ప్రయాణిస్తూనే.. మరెంతో మందిని వ్యాపార రంగంలో నిలదొక్కుకునేలా చేస్తున్నారు. ఆహార రంగానికి అనుబంధమైన యంత్రాలను అత్యాధునికంగా తయారు చేస్తూ.. చిరు వ్యాపారులకు నాణ్యమైన ఆహార ఉత్పత్తులను అందించే పరికరాలను అందుబాటులోకి తెస్తున్నారు. ఆధునిక సాంకేతిక పరిజ్ఞానంతో కూడిన యంత్రాలను తెలుగు రాష్ట్రాలతో పాటు 60 దేశాలకు ఎగుమతి చేస్తున్న భ్రమరాంబ.. ఎందరికో స్పూర్తిదాయకంగా నిలుస్తున్నారు.

గుంటూరు టు ఫిల్మ్ ఎడిటర్ వయా అమెరికా.. తొలి మహిళా ఎడిటర్ సృజన అడుసుమిల్లి

A Vijayawada Woman Providing Machinery in the Food Sector: తెలుగు రాష్ట్రాల్లోనే కాదు.. దేశంలోని అనేక నగరాల్లో చిరు వ్యాపారులు వినియోగిస్తున్న వినూత్న యంత్రాలను చూస్తే భ్రమరాంబ గుర్తుకొస్తారు. ఆహార రంగంలో చిన్నదైనా.. పెద్దదైనా.. ఏదో ఒక వ్యాపారం చేయాలనుకునే ప్రతి ఒక్కరి కోసం.. అధునాతన పరిజ్ఞానాన్ని జోడించి పరికరాలను రూపొందిస్తున్నారీమె. మీ వ్యాపార విజయానికి మూలస్తంభంగా నేనుంటానంటూ.. వెన్నుతట్టి ప్రోత్సహిస్తున్నారు. చిన్న అంకుర సంస్థలుగా మొదలుపెట్టించి.. ఆ తర్వాత వారిని ఔత్సాహిక వ్యాపారవేత్తలుగా ఎదిగేంతవరకూ సలహాలు, సూచనలు అందిస్తున్నారు.

Chandramouli Story: విధిరాతను జయించి.. మొక్కవోని ధైర్యంతో గెలుపొందిన అనకాపల్లి యువకుడు

ఆహార రంగంలో వందల రకాల యంత్ర పరికరాలను కూలెక్స్‌ కంపెనీ ద్వారా ఇప్పటివరకూ రూపొందించారు. తెలుగు రాష్ట్రాల్లో కూలెక్స్ ఇండస్ట్రీకి ఓ ప్రత్యేక గుర్తింపు ఉంది. అంతేకాదు 60దేశాలకు ఈ కూలెక్స్‌ ఉత్పత్తులు ఎగుమతి చేస్తున్నారు. సంస్థ ఎదుగుదల కోసం తన భర్త రాధాకృష్ణతో కలిసి భ్రమరాంబ ఎన్నో ఒడిదొడుకులు ఎదుర్కొన్నామని చెబుతున్నారు.

భావితరాల కోసం కలగన్నారు.. సంఘటితమై సాధించారు

Best Women Enterpreneur Bhramaramba: కష్టం లేకుండా తేలికగా చెరకు రసం తీసే యంత్రం, పాప్‌కార్న్‌ తయారీ మిషన్, ఒకే యంత్రంలో నాలుగైదు రకాల ఐస్‌క్రీమ్స్, కూల్‌డ్రింక్స్, రకరకాల రేఫర్‌ చాక్లెట్లను తయారుచేసే యంత్రాలు, చాక్లెట్‌ ఫౌంటైన్స్, ఎగ్‌రోల్‌ మిషన్స్‌.. ఇలా ఆహార రంగంలోని వ్యాపారులకు అవసరమైన 300కు పైగా యంత్రాలను ఇప్పటివరకూ రూపొందించారు. వీటిలో హాట్‌ అండ్‌ కూల్‌ రెండు రకాల ఆహార ఉత్పత్తులకూ అనుకూలమైన యంత్రాలున్నాయి.

పది వేల రూపాయల నుంచి 15 లక్షల రూపాయల వరకూ విలువ చేసే పరికరాలున్నాయి. వ్యాపార స్థాయిని బట్టి వాళ్లు వ్యాపారం చేసేందుకు అవసరమయ్యే అన్ని యంత్రాలు కూలెక్స్‌లో అందుబాటులో తీసుకొచ్చామంటున్నారు మహిళా పారిశ్రామికవేత్త.

పిల్లల కలల్ని నిజం చేసిన ఓ తండ్రి కథ.. రామోజీ ఫిలింసిటీ డ్రైవర్ సక్సెస్‌ స్టోరీ

Coolex Industries Private Limited in Vijayawada: కూలెక్స్ కంపెనీలో రోజుకు కనీసం 75 మంది కొత్తగా వ్యాపారం చేయాలనుకునే వాళ్లు ఈ సంస్థకు వచ్చి యంత్రాలను చూసి వివరాలు తెలుసుకుంటున్నారు. నెలకు రెండు వేలకుపైగా యంత్రాలు విక్రయిస్తున్నారు. 2018 సంవత్సరం నుంచి చిన్నపిల్లలు ఆడుకునే వినోదాత్మక యంత్రాలను తయారుచేస్తున్నారు. వ్యాపార కోణమే కాకుండా.. సమాజానికి తోడ్పాటు అందించాలనే లక్ష్యంతో సాగుతున్న భ్రమరాంబ.. రాష్ట్ర ప్రభుత్వం నుంచి ‘బెస్ట్‌ ఉమెన్‌ ఎంట్రపెన్యూర్‌ అవార్డు, శ్రామిక విద్యా పీఠ్, ఎలీప్, ఏపీ చిరు వ్యాపారుల సంఘం అవార్డులు అందుకున్నారు. చిరు వ్యాపారం చేయాలనే ఆలోచన ఉన్న ప్రతి ఒక్కరికీ తామున్నామనే భరోసా కల్పించాలనేదే తమ సంస్థ ప్రధాన లక్ష్యమంటున్నారు భ్రమరాంబ.

Business Success Story : 12ఏళ్లలో 300స్టోర్లు.. లాభాల బాటలో 'బిగ్‌ బాస్కెట్‌'.. హరి మీనన్‌ సక్సెస్‌ సీక్రెట్​ ఇదే!

ABOUT THE AUTHOR

...view details