Woman employee Protest : తనకు ప్రాణహాని ఉందని.. రక్షణ కల్పించాలని లక్ష్మమ్మ అనే ప్రభుత్వ ఉద్యోగి తాడేపల్లి సీఎం క్యాంపు కార్యాలయం వద్ద ఆందోళనకు దిగారు. తాడేపల్లిలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో పనిచేస్తోన్న ఆమెకు.. నాలుగు నెలలుగా ప్రభుత్వం నుంచి జీతం రావటం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. తన అన్న రోజూ వచ్చి హింసిస్తున్నాడని.. చంపేస్తానని బెదిరిస్తున్నాడని ఆరోపించారు. తన అన్న నుంచి ప్రాణహాని ఉందని తాడేపల్లి పోలీసులకు ఫిర్యాదు చేసినా.. పట్టించుకోవటంలేదని రోడ్డుపై బైఠాయించి నిరసన తెలిపారు. ముఖ్యమంత్రి కలిసి ఫిర్యాదు చేస్తానని ఆమె క్యాంపు కార్యాలయం వద్ద చెక్‌పోస్టు పోలీసులను కోరారు. ముఖ్యమంత్రిని నేరుగా కలిసే అవకాశం లేదని తెలిపారు. చెక్‌పోస్టులోని పోలీసులు మహిళ నుంచి ఫిర్యాదు తీసుకుని సమస్యను పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు.
జీతం అందటం లేదని.. సీఎం క్యాంపు కార్యాలయం వద్ద మహిళ ఉద్యోగి నిరసన
Protest At Cm Camp Office: తనకు ప్రాణహాని ఉందని ఓ మహిళ ఉద్యోగి తాడేపల్లిలోని సీఎం క్యాంపు కార్యాలయం వద్ద ఆందోళనకు దిగింది. తనకు జీతం అందటం లేదని.. తన అన్న బెదిరిస్తున్నాడని ఆవేదన వ్యక్తం చేసింది. ముఖ్యమంత్రిని కలిసి తన బాధను చెప్పుకుంటానని పోలీసులను కోరింది. చివరికి ఏం జరిగిందంటే..
మహిళ ఉద్యోగి నిరసన.