ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

రాష్ట్రవ్యాప్తంగా బంగారం దుకాణాల్లో తనిఖీలు - Gold Shops raids news

raids on Jewellery shops : రాష్ట్రవ్యాప్తంగా పలు జిల్లాల్లోని నగల దుకాణాలలో తూనికలు, కొలతల శాఖ అధికారులు తనిఖీలు చేపట్టారు. ఈ తనిఖీలలో బంగారం తూకం వేసే యంత్రాల పనితీరును పరిశీలించారు. నిబంధనలకు విరుద్ధంగా ఉన్న దుకాణాల పైన చట్టపరమైన చర్యలకు అదేశించినట్లు అధికారులు తెలిపారు.

raids on Jewellery shops
బంగారం దుకాణాల్లో తనిఖీలు

By

Published : Dec 12, 2022, 9:05 PM IST

Raids on Jewellery Shops : తూకాలలో తేడాలు వస్తున్నాయని అందిన ఫిర్యాదుల మేరకు తూనికలు, కొలతల శాఖ అధికారులు రాష్ట్రవ్యాప్తంగా తనిఖీలు చేపట్టారు. తణుకు, విజయవాడ, తిరుపతి తదితర ప్రాంతాల్లో అధికారులు తనిఖీలు నిర్వహించారు. విజయవాడలోని పలు జ్యూవెల్లర్స్​లో తూనికలు, కొలతల శాఖ అధికారులు మెరుపు దాడులు నిర్వహించారు. పైఅధికారుల నుంచి ఆదేశాలు రావటంతో.. ఈ దాడులు నిర్వహించినట్లు ఉమ్మడి కృష్ణా జిల్లా తూనికలు, కొలతల శాఖ డిప్యూటీ కంట్రోలర్​ కృష్ణ చైతన్య తెలిపారు. ఈ తనిఖీల్లో బంగారం బరువులో వ్యత్యాసాలు ఉన్నట్లు గుర్తించామన్నారు. సరైన ప్రమాణాలు లేని యంత్రాలను బంగారం తూకం వేయాటానికి వినియోగిస్తున్నట్లు.. గుర్తించామని ఆయన తెలిపారు. ​అవకతవకలకు పాల్పడిన జ్యూవెల్లర్స్​ యాజమానులపై చర్యలు తీసుకుంటామని తెలిపారు.

కృష్ణచైతన్య, తూనికలు, కొలతల శాఖ డిప్యూటీ కంట్రోలర్

"తనిఖీల్లో మేము బంగారం దుకాణాలు వినియోగించే.. తూకాల యంత్రాలను పరిశీలిస్తున్నాము. తూనికలు కొలతల శాఖ అనుమతులు పొందిన యంత్రాలను వినియోగిస్తున్నారా లేదా అని పరిశీలించాము. విజయవాడ కళ్యాణ్​ జ్యావెల్లర్స్​లో అవకతవకలు గమనించాము. దీనిపై శాఖపరమైన చర్యలు తీసుకుంటాం." - కృష్ణచైతన్య, తూనికలు, కొలతల శాఖ డిప్యూటీ కంట్రోలర్

పశ్చిమగోదావరి జిల్లాలో సైతం అధికారులు బంగారం దుకాణాలపై దాడులు నిర్వహించారు. తణుకులోని బంగారం దుకాణాలపై దాడులు నిర్వహించిన అధికారులు.. తూకాలలో తేడాలు గమనించిన దుకాణాలపై కేసులు నమోదు చేశారు. తణుకులో నాలుగు బృందాలుగా విడిపోయిన అధికారులు.. దాడులు నిర్వహించి అవకతవకలకు పాల్పడిన 25మందిపై కేసులు నమోదు చేశారు.

ఇవీ చదవండి:

ABOUT THE AUTHOR

...view details