AP VRO's Protest : రాష్ట్రవ్యాప్తంగా ఎమ్మార్వో కార్యాలయాల వద్ద వీఆర్‌వోలు నిరసన తెలిపారు. మధ్యాహ్నం భోజన విరామ సమయంలో వీఆర్‌వోలు నిరసన తెలిపారు. పనిభారం, ఒత్తిడి, సస్పెన్షన్లు, వేధింపులు అధికంగా ఉన్నాయని వీఆర్‌వోలు ఆవేదన వ్యక్తం చేశారు. వీఆర్‌వోలకు పని ఒత్తిడి తగ్గించాలని వీఆర్‌వోల సంఘం అధ్యక్షుడు భూపతిరాజు రవీంద్రరాజు ప్రభుత్వాన్ని కోరారు. పని ఒత్తిడితో మరణించిన వీఆర్‌వోల కుటుంబాలకు న్యాయం చేయాలని డిమాండ్ చేశారు. రీసర్వేకు వీఆర్‌వోలే సొంతడబ్బు ఖర్చు పెట్టాల్సి వస్తుందని వాపోయారు. ప్రొహిబిషన్లో విధులు నిర్వహిస్తున్న 3 వేల 795 మందికి డిక్లేర్ చేసి, పే స్కేల్ ఇవ్వాలని కోరారు.
సమస్యలు పరిష్కరించాలని రాష్ట్రవ్యాప్తంగా వీఆర్‌వోల నిరసన - VROs Association President Comments
VRO's Protest : రాష్ట్రంలోని వీఆర్‌వోలు ఎమ్మార్వో కార్యాలయాల వద్ద నిరసనకు దిగారు. సోమవారం మధ్యాహ్నం భోజన విరామ సమయంలో ఈ నిరసన కార్యక్రమం చేపట్టారు. పనిభారం అధికంగా ఉందని వారు ఆవేదన వ్యక్తం చేశారు.
వీఆర్‌వోల నిరసన