Volunteers, Sanitation Workers Strike against YSRCP Govt: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అసెంబ్లీ ఎన్నికలు సమీపిస్తున్న వేళ గతకొన్ని రోజులుగా అనూహ్య పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి పరిపాలనను వ్యతిరేకిస్తూ ప్రజలు, ప్రభుత్వ ఉద్యోగులు, అంగన్‌వాడీ కార్యకర్తలు, పారిశుద్ధ్య కార్మికులు, సమగ్రశిక్షా అభియాన్ సిబ్బందితోపాటు వాలంటీర్లు సమ్మె బాట పట్టారు. తాము అధికారంలోకి వస్తే అది చేస్తాం, ఇది చేస్తాం అని హామీల మీద హామీలిచ్చిన వైఎస్ జగన్ మోహన్ రెడ్డి, అధికారం చేపట్టి నాలుగేన్నరేళ్లు గడిచినా ఏ ఒక్క హామీని నేరవేర్చకపోవడంపై అంగన్‌వాడీ కార్యకర్తలు, పారిశుద్ధ్య కార్మికులు, సమగ్రశిక్షా అభియాన్ సిబ్బంది ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ప్రజావేదిక కూల్చివేతతో తన పరిపాలనను ప్రారంభించిన సీఎం జగన్, అన్ని రంగాలను కూల్చివేశారని దుయ్యబడుతున్నారు. తమ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత కాంట్రాక్టు, అవుట్ సోర్సింగ్ కార్మికులను పర్మినెంట్ చేస్తాం, సమాన పనికి సమాన వేతనం ఇస్తామంటూ తమని దారుణంగా మోసం చేశారని కార్మికులు ఆవేదన చెందుతున్నారు.
Workers Fire on CM Jagan Administration:రాష్ట్ర ముఖ్యమంత్రిగా వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ప్రమాణ స్వీకారం చేసిన రోజు మొదలుకొని ఈరోజు వరకూ తీవ్ర విమర్శలకు గురవుతూనే ఉన్నారు. ప్రజావేదిక కూల్చివేతతో తన అరాచక పాలనకు నాంది పలికిన సీఎం జగన్, రాష్ట్రాన్ని అప్పులపాలు చేసి, అన్ని రంగాలను నిర్వీర్వం చేశారని ప్రజలు, నిరుద్యోగులు, కార్మికులు, ప్రభుత్వ ఉద్యోగులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అధికారంలోకి రాకముందు 'మా ప్రభుత్వం ఏర్పడితే కాంట్రాక్టు, అవుట్ సోర్సింగ్ కార్మికులను పర్మినెంట్ చేస్తాం. సమాన పనికి సమాన జీతం ఇస్తాం. ప్రతి ఏటా జాబ్ క్యాలెండర్ ఇస్తాం. రాష్ట్రాన్ని అభివృద్ధిలో బాటలో నడుపుతాం' అని వైఎస్ జగన్ హామీలిచ్చారని, నాలుగున్నరేళ్లు గడిచిపోతున్నా ఏ ఒక్క హామీని నేరవేర్చాలేదని విమర్శిస్తున్నారు. అయితే, సీఎం జగన్ నాలుగున్నరేళ్ల పాలనలో సమ్మెల బాట పట్టిన ప్రభుత్వ ఉద్యోగులు, కార్మికులను ఒకసారి పరిశీలిస్తే పలు కీలక విషయాలు స్ఫురణకు వస్తాయి.
'వైఎస్సార్సీపీ పాలనలో విద్యావిధానం అస్తవ్యస్తం - విద్యార్థుల భవిష్యత్తుతో చెలగాటమాడొద్దు'
Anganwadi Strike Updates:వేతనాల పెంపు, గ్రాట్యుటీ, ఉద్యోగ భద్రత, ప్రభుత్వ ఉద్యోగులుగా తమను గుర్తించాలని కోరుతూ అంగన్‌వాడీ కార్యకర్తలు (టీచర్లు), ఆయాలు (హెల్పర్లు) డిసెంబర్ 12వ తేదీ నుంచి రాష్ట్ర వ్యాప్తంగా సమ్మెకు దిగారు. నాలుగున్నరేళ్లుగా కనీస వేతనానికి నోచుకోకుండా పని చేస్తున్నామని, తమ డిమాండ్లు నెరవేర్చేవరకూ విధులకు హాజరుకాబోమని అంగన్‌వాడీలు తేల్చిచెప్పారు. తాము అధికారంలోకి రాగానే అంగన్‌వాడీలను అన్ని విధాలా ఆదుకుంటామని హామీ ఇచ్చిన సీఎం జగన్ మాట తప్పి, మడమ తిప్పారని అంగన్‌వాడీలు మండిపడుతున్నారు.