విజయవాడలో అధ్వానంగా దర్శనమిస్తున్న పార్కులు- పట్టించుకోని వీఎంసీ అధికారులు Vijayawada Parks: మానసిక ప్రశాంతతకు, ఒత్తిడి నుంచి ఉపశమనానికి పార్కులు ఎంతో దోహదపడతాయి. అలాంటి పార్కులను అభివృద్ధి చేయాల్సిన బాధ్యత పాలకులపై ఉంటుంది. విజయవాడలో తెలుగుదేశం హయాంలో పార్కులు నిర్మించి వాటికి అవసరమైన ఆట వస్తువులు, వ్యాయామ పరికరాలు, కూర్చునేందుకు బల్లలు ఏర్పాటు చేశారు. ప్రస్తుతం వాటి నిర్వహణ గాలికొదిలేశారు. కనీసం పిచ్చిమొక్కలను కూడా తొలగించకపోవడంతో ఎవరూ పార్కుల్లోకి ప్రవేశించలేని పరిస్థితులు నెలకొన్నాయి.
No Equipment in Parks: విజయవాడలోని సీటీవో కాలనీ, భారతీనగర్, ఎల్ఐసీ కాలనీల్లోని పార్కుల నిర్వాహణను నగర పాలక సంస్థ గాలికొదిలేసింది. ఈ ప్రాంతాల్లోని పార్కులు అసాంఘిక కార్యక్రమాలకు అడ్డాగా మారుతున్నాయి. కనీస నిర్వహణ లేక పార్కుల్లో పెద్దఎత్తున చెత్త పేరుకుపోతోంది. చిన్నారుల కోసం ఏర్పాటుచేసిన ఆట వస్తువులు.. వ్యాయామ పరికరాలు పూర్తిగా పాడైపోయాయి. కూర్చోడానికి ఏర్పాటు చేసిన బల్లలు సైతం ధ్వంసమయ్యాయి. పార్కుల పరిస్థితి అధ్వానంగా ఉన్నా అధికారులు పట్టించుకోవడం లేదని స్థానికులు విమర్శిస్తున్నారు.
Jagan Govt Neglected Development of Amrit Parks: పచ్చదనంపై జగన్ సర్కార్ నిర్లక్ష్యం.. మూత పడుతున్న ఉద్యానవనాలు
"పిల్లలు ఆడుకునేందుకు, పెద్దవారు సేదతీరేందుకు ఉపయోగపడే పార్కులు.. ఇప్పుడు అసాంఘిక కార్యక్రమాలకు అడ్డాగా మారుతున్నాయి. కనీస నిర్వహణ లేక పార్కుల్లో పెద్దఎత్తున చెత్త పేరుకుపోతోంది. చిన్నారుల కోసం ఏర్పాటుచేసిన ఆట వస్తువులు.. వ్యాయామ పరికరాలు పూర్తిగా పాడైపోయాయి. కూర్చోడానికి ఏర్పాటు చేసిన బల్లలు సైతం ధ్వంసమయ్యాయి. పార్కుల పరిస్థితి అధ్వానంగా ఉన్నా అధికారులు పట్టించుకోవడంలేదు." - జాస్తి సాంబశివరావు, కార్పొరేటర్
AP Parks in Bad Condition: ఎల్ఐసీ కాలనీలోని ఉండే పార్కు పూర్తిగా పిచ్చి మొక్కలతో నిండిపోయింది. నాలుగేళ్ల క్రితం పార్కులోనే ఆటలు, వాకింగ్ వంటివి చేసే వాళ్లమని ప్రస్తుతం పార్కు తలుపులు తీసి లోపలికి వెళ్లేందుకే అవకాశం లేని విధంగా మారిపోయిందని కాలనీవాసులు చెబుతున్నారు. కొంతమంది ఆకతాయిలు అసాంఘిక కార్యక్రమాలకు అడ్డాగా మార్చుకున్నారు.
పార్కులు ఏం చేశాయ్..! పూర్తి కావచ్చిన ఉద్యానవనాలనూ పట్టించుకోని ప్రభుత్వం
గతంలో పార్కు నిర్వహణను కాలనీ వాసులకే వీఎంసీ అధికారులు అప్పగించారు. ఆ తరువాత వీఎంసీ సిబ్బందే ప్రత్యక్షంగా పార్కు నిర్వాహణ చూసుకుంటుందని ప్రకటించారు. కొన్ని రోజులు నిర్వాహణ బాగానే జరిగినా.. నాలుగేళ్ల నుంచి పట్టించుకోకపోవడంతో ప్రజలకు ఉపయోగపడని విధంగా పార్కు తయారైంది. సీటీవో కాలనీ, భారతీనగర్‌లోని పార్కులు సైతం చెత్తా చెదారంతో దర్శనమిస్తున్నాయి.
"వీఎంసీ అధికారులు గతంలో పార్కుల నిర్వహణను కాలనీవాసులకే అప్పగించారు. ఆ తర్వాత వీఎంసీ సిబ్బందే ప్రత్యక్షంగా పార్కు నిర్వహణ చూసుకుంటుందని ప్రకటించారు. కొన్ని రోజులు నిర్వాహణ బాగానే జరిగినా.. తర్వాత అధికారులు పట్టించుకోకపోవటంతో అసాంఘిక కార్యక్రమాలకు నిలయమైంది. నిర్వహణలోపంతో చెత్త పేరుకుపోయింది. దీంతోపాటు పిచ్చిమొక్కలు పెరిగిపోయి పాములు కూడా ప్రవేశిస్తున్నాయి."- స్థానికులు
VMC Model Parks: పార్కులకు అదనపు సొబగులు..నందనవనంగా నగరం..