ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

విజయవాడ వాసులకు సినిమాపై ప్రత్యేక అభిమానం: జంపన కృష్ణ కిషోర్ - విజయవాడ వార్తలు

Vijayawada Film Society Meeting: సినిమాలకు, భాషకు కేంద్ర బిందువు విజయవాడ అని.. విజయవాడ ఫిలిం సొసైటీ రాష్ర కార్యదర్శి జంపన కృష్ణ కిషోర్ అన్నారు. విజయవాడ ఫిలిం సొసైటీ స్వర్ణోత్సవం సందర్భంగా.. విజయవాడలో సర్వ సభ్య సమావేశం ఏర్పాటు చేశారు.

Golden jubilee of Vijayawada Film Society
విజయవాడ ఫిలిం సొసైటీ స్వర్ణోత్సవం

By

Published : Jan 22, 2023, 9:55 PM IST

Vijayawada Film Society Meeting: విజయవాడ ఫిలిం సొసైటీ స్వర్ణోత్సవం సందర్భంగా సర్వ సభ్య సమావేశం విజయవాడలో నిర్వహించారు. సుమారు 50 సంవత్సరాల క్రితం విజయవాడ ఫిలిం సొసైటీని స్థాపించారని విజయవాడ ఫిలిం సొసైటీ రాష్ట్ర కార్యదర్శి జంపన కృష్ణ కిషోర్ అన్నారు. సినిమాపై విజయవాడ ప్రేక్షకులకు ప్రత్యేక అభిమానం ఉందన్నారు. సినిమాలకు, భాషకు కేంద్ర బిందువుగా విజయవాడ ఉందన్నారు. ఏ సినిమా అయినా విజయవాడ ప్రేక్షకులకు నచ్చితే అది విజయవంతమనే నమ్మకం నిర్మాతల్లో ఉందన్నారు. విజయవాడ ఫిలిం సొసైటీ ఆధ్వర్యంలో అంతర్జాతీయ ప్రమాణాలతో చిత్రాలను నిర్మించడం, సరికొత్త సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగించడం వంటి అంశాలపై సంస్థ కొన్ని కార్యక్రమాలు చేపట్టనుందని తెలిపారు. భవిష్యత్తులో విజయవాడ ఫిలిం సొసైటీ ఆద్వర్యంలో మరిన్ని కార్యక్రమాలు చేపడతామన్నారు.

ABOUT THE AUTHOR

...view details