ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

Vijayawada ACB Court Approved CID PT Warrant: సోమవారం చంద్రబాబును వ్యక్తిగతంగా హాజరుపర్చండి: ఏసీబీ కోర్టు ఆదేశం

Vijayawada ACB Court Approved CID PT Warrant: ఫైబర్‌ నెట్‌ కేసులో సీఐడీ దాఖలు చేసిన పీటీ వారెంట్‌ను విజయవాడ ఏసీబీ కోర్టు సమ్మతించింది. సోమవారం ఉదయం 10.30 నుంచి సాయంత్రం 5గంటల లోపు చంద్రబాబును వ్యక్తిగతంగా కోర్టులో హాజరుపర్చాలని ఆదేశాలు జారీ చేసింది.

ACB_Court_Approved_CID_PT_Warrant
ACB_Court_Approved_CID_PT_Warrant

By ETV Bharat Andhra Pradesh Team

Published : Oct 12, 2023, 8:34 PM IST

Vijayawada ACB Court Approved CID PT Warrant: తెలుగుదేశం పార్టీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడిని సోమవారం ఉదయం 10.30 నుంచి సాయంత్రం 5 గంటలలోపు కోర్టులో వ్యక్తిగతంగా హాజరుపర్చాలని.. విజయవాడ ఏసీబీ కోర్ట్ ఆదేశాలు జారీ చేసింది. ఫైబర్‌ నెట్‌ కేసులో సీఐడీ దాఖలు చేసిన పీటీ వారెంట్‌పై గురువారం న్యాయస్థానం విచారణ చేపట్టింది. విచారణలో భాగంగా సీఐడీ తరుఫు న్యాయవాది చంద్రబాబును వ్యక్తిగతంగా కోర్టులో హాజరుపర్చాలంటూ వాదనలు వినిపించారు. న్యాయవాది వాదనలను పరిగణలోనికి తీసుకున్న న్యాయాధికారి.. పీటీ వారెంట్‌కు అనుమతి ఇస్తూ ఆదేశాలు జారీ చేశారు.

ACB Court Hearing on PT Warrant:ఏపీ ఫైబర్ నెట్ వ్యవహారానికి సంబంధించి.. విజయవాడ ఏసీబీ కోర్టు కీలక ఆదేశాలు జారీ చేసింది. మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబుపై సీఐడీ కోరిన పీటీ వారెంట్‌కు న్యాయాధికారి అనుమతించారు. సోమవారం చంద్రబాబును కోర్టులో హాజరుపరచాలని ఆదేశించారు. సోమవారం ఉదయం పదిన్నర గంటల నుంచి సాయంత్రం ఐదున్నర గంటలలోపు ప్రత్యక్షంగా హాజరుపరచాలంటూ.. పీటీ వారెంట్ల పిటిషన్‌పై నిర్ణయాన్ని వెల్లడించారు.

High Court Hearing on CBN Angallu Case Bail Petition: అంగళ్లు కేసు.. చంద్రబాబు ముందస్తు బెయిల్‌పై హైకోర్టు తీర్పు రిజర్వ్‌

Arguments in Supreme Court Tomorrow on CBN Quash Petition: స్కిల్‌ డెవలప్‌మెంట్‌ కేసులో అరెస్టయి రాజమహేంద్రవరం కేంద్ర కారాగారంలో ఉన్న చంద్రబాబుకు ఈనెల 19వ తేదీ వరకు జ్యుడీషియల్‌ రిమాండ్‌ ఉండనున్నారు. ఈ క్రమంలో సోమవారం వ్యక్తిగతంగా ఆయనను (చంద్రబాబు) కోర్టులో హాజరుపర్చాలని న్యాయాధికారి ఆదేశించారు. ఈ నేపథ్యంలో చంద్రబాబు దాఖలు చేసిన క్వాష్‌ పిటిషన్‌పై శుక్రవారం సుప్రీంకోర్టులో వాదనలు కొనసాగనున్నాయి. సుప్రీంకోర్టు ఇచ్చే ఆదేశాలకు అనుగుణంగా వ్యవహరిస్తామని ఏసీబీ కోర్టు తెలిపింది.

ACB Court Received Call Data Petition: మరోవైపు చంద్రబాబు నాయుడు తరఫు న్యాయవాదులు దాఖలు చేసిన కాల్‌ డేటా పిటిషన్‌ను విజయవాడ ఏసీబీ కోర్టు విచారణకు స్వీకరించింది. ఆ పిటిషన్‌పై వాదనలు శుక్రవారానికి వాయిదా వేయాలని సీఐడీ తరఫు న్యాయవాది కోరగా.. అందుకు న్యాయమూర్తి అంగీకరించలేదు. ప్రస్తుతం ఏసీబీ కోర్టులో కాల్‌ డేటా పిటిషన్‌పై వాదనలు కొనసాగుతున్నాయి. ఈ క్రమంలో సోమవారం వ్యక్తిగతంగా చంద్రబాబును కోర్టుకు హాజరుపరిచేలా చర్యలు తీసుకోవాలంటూ జైళ్లశాఖ అధికారులకు అ.ని.శా న్యాయాధికారి ఆదేశించారు.

HC Adjourned Chandrababu Bail Petition Hearing: చంద్రబాబు బెయిల్‌ పిటిషన్‌ విచారణ... 17కు వాయిదా వేసిన హైకోర్టు

Right of Audience Petition Dismissed:ఫైబర్‌ నెట్‌ కార్పొరేషన్‌లో అవకతవకలు జరిగాయని.. ఈ కేసులో చంద్రబాబు ప్రమేయం ఉన్నందున అతన్ని విచారించేందుకు సీఐడీ దాఖలు చేసిన పీటీ వారెంటుపై వాదనలు ముగియడంతో గురువారం సాయంత్రం నాలుగు గంటల తర్వాత ఉత్తర్వులు ఇచ్చారు. పీటీ వారెంట్‌ విషయంలో తమ వాదనలను వినాలని చంద్రబాబు తరఫు న్యాయవాదులు వేసిన ‘రైట్‌ ఆఫ్‌ ఆడియన్స్‌’ పిటిషన్‌ను ఏసీబీ కోర్టు డిస్మిస్‌ చేయడంతో వారి వాదనలకు అవకాశం లేకుండా పోయింది. సుప్రీంకోర్టులో రేపు చంద్రబాబు కేసులపై విచారణ ఉన్నందున.. అక్కడి తీర్పుకు లోబడి జోక్యం చేసుకోవచ్చని చంద్రబాబు తరపు న్యాయవాదులకు అ.ని.శా. కోర్టు న్యాయాధికారి సూచించారు.

TDP Leader Pattabhi Ram on AP FiberNet Project: అతి తక్కువ ఖర్చుతో ఫైబర్ నెట్ ప్రాజెక్టు పూర్తి.. టెలికం లైసెన్స్ చంద్రబాబు ఘనతే : పట్టాభి

ABOUT THE AUTHOR

...view details