ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

వెలిగొండకు శంకుస్థాపన చేసింది మేమే.. అధికారంలోకి వచ్చి పూర్తి చేసేది మేమే: చంద్రబాబు - వెలిగొండ నిర్వాసితులు

VELIGONDA EXPATRIATES MET CBN : 2004కు ముందు తమ హయాంలో శంకుస్థాపన చేసిన వెలిగొండ ప్రాజెక్టును.. తిరిగి అధికారంలోకి రాగానే పనులు పూర్తి చేసి ప్రారంభిస్తామని నిర్వాసితులకు తెలుగుదేశం అధినేత చంద్రబాబు హామీ ఇచ్చారు. యర్రగొండపాలెం నియోజకవర్గ నేతలతో కలిసి వెలిగొండ ప్రాజెక్టు నిర్వాసిత రైతులు.. ఎన్టీఆర్ భవన్‌లో చంద్రబాబును కలిశారు.

VELIGONDA EXPATRIATES MET CBN
VELIGONDA EXPATRIATES MET CBN

By

Published : Feb 11, 2023, 8:31 AM IST

VELIGONDA EXPATRIATES MET CBN : వెలిగొండ ప్రాజెక్టుకు నాడు శంకుస్థాపన చేసింది తామేనని, మళ్లీ తెలుగుదేశం అధికారంలోకి వచ్చిన తరువాత ఆ పనులను పూర్తి చేసి ప్రాజెక్ట్​ను ప్రారంభించేదీ తామేనని టీడీపీ అధినేత చంద్రబాబు స్పష్టం చేశారు. మెరుగైన ప్యాకేజ్ ఇవ్వడంతో పాటు వారికి అన్ని విధాలా న్యాయం చేస్తామని హామీ ఇచ్చారు. ప్రకాశం జిల్లా ఎర్రగొండపాలెం నియోజకవర్గ ఇంఛార్జ్ ఎరిక్షన్ బాబు నేతృత్వంలో పెద్దారవీడు మండలం రైతులు ,వెలిగొండ ప్రాజెక్టు నిర్వాసిత రైతులు చంద్రబాబును పార్టీ కేంద్ర కార్యాలయం ఎన్టీఆర్ భవన్​లో కలిశారు.

వెలిగొండకు శంకుస్థాపన చేసింది మేమే.. అధికారంలోకి వచ్చి పూర్తి చేసేది మేమే: చంద్రబాబు

వైసీపీ ప్రభుత్వం ఇచ్చిన హామీలు ఏవీ నెరవేర్చలేదని ఆవేదన వ్యక్తం చేశారు. ఆర్​ అండ్​ ఆర్​ ప్యాకేజ్ కింద తెలుగుదేశం ప్రభుత్వం రూ.12.5 లక్షలు ఇచ్చేందుకు నాడు ఉత్తర్వులు ఇస్తే.. అధికారంలోకి వస్తే 18 లక్షల రూపాయలు ఇస్తామని వైసీపీ నేతలు ఇచ్చిన హామీని విస్మరించారని రైతులు మండిపడ్డారు. తెలుగుదేశం ప్రభుత్వం వచ్చిన తరువాత మెరుగైన ప్యాకేజ్ ఇవ్వడంతో పాటు కొత్త కటాఫ్​ డేట్ ప్రకారం పరిహారం అందేలా చూడాలని చంద్రబాబును నిర్వాసితులు కోరారు.

"వెలిగొండ ప్రాజెక్టుకు ఫౌండేషన్​ వేసి పని ప్రారంభించిన పార్టీ తెలుగుదేశం. తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉంటే 2020 జూన్​ కల్లా మీకు నీళ్లు వచ్చేవి. నాలుగేళ్లు దాటినా వెలిగొండ ప్రాజెక్టు పూర్తి కాలేదు.. వీళ్లు చేసేది కూడా ఏమి లేదు"-చంద్రబాబు, టీడీపీ అధినేత

ఉమ్మడి రాష్ట్రంలో ప్రకాశం జిల్లా కరవు ప్రాంత అవసరాలను గుర్తించి తాను వెలిగొండ ప్రాజెక్టుకు తలపెట్టామనని చంద్రబాబు గుర్తు చేశారు. 2004 తరువాత వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో పనులు సాగలేదని వాపోయారు. 2014 తరువాత మళ్లీ టీడీపీ అధికారంలోకి వచ్చిన తరువాత కాంట్రాక్టర్లతో ఉన్న ఇబ్బందులు, సమస్యలను పరిష్కరించి పనులు వేగవంతం చేశామన్నారు. 2019లో అధికారంలోకి వచ్చిన జగన్ ప్రభుత్వం ప్రాజెక్ట్​లో మిగిలి ఉన్న 10 శాతం పనులను కూడా పూర్తి చెయ్యలేకపోయిందని విమర్శించారు. 2019లో టీడీపీ అధికారంలోకి వచ్చి ఉంటే 2020కే వెలిగొండ ప్రాజెక్టు పూర్తి అయ్యేదని తేల్చి చెప్పారు.

ఇవీ చదవండి:

ABOUT THE AUTHOR

...view details