Veerulupadu Villagers Protest : ఎన్టీఆర్ జిల్లాలో వీరులపాడు మండల కేంద్రాన్ని తరలించవద్దని గ్రామస్థులు రాజకీయాలకు అతీతంగా తహసీల్దార్ కార్యాలయం వద్ద నిరసన తెలిపారు. స్థానిక ఎమ్మెల్యే మొండితోక జగన్మోహన్రావు, ఎమ్మెల్సీ మొండితోక అరుణ్ కుమార్లకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. మండల కేంద్రాన్ని జుజ్జూరు గ్రామానికి తరలిస్తున్నట్లు రాష్ట్ర మంత్రివర్గం ఇటీవల తీర్మానం చేసింది.
వీరులపాడు మండల కేంద్రాన్ని తరలిస్తే.. ఊరుకోం: గ్రామస్థులు - government cheated amaravathi farmers
Veerulupadu Villagers Protest Event : ఎన్టీఆర్ జిల్లాలోని వీరులపాడు మండలకేంద్రాన్ని తరలించవద్దని గ్రామస్థులు రాజకీయాలకు అతీతంగా తహసీల్దార్ కార్యలయం వద్ద నిరసన చేశారు. ఎమ్మెల్యే, ఎమ్మెల్సీకి వ్యతిరేకంగా స్థానికులు నినాదాలు చేశారు.
Veerulupadu
మండలం ఏర్పాటు చేసినప్పుడు వివిధ ప్రభుత్వ కార్యాలయాల ఏర్పాటుకు తాము ఉచితంగా స్థలాలు అందజేశామని, ఇప్పుడు మండల కేంద్రాన్ని ఎలా తరలిస్తారని గ్రామస్థులు ఆవేదన వ్యక్తం చేశారు. వీరులపాడులోనే మండల కేంద్రాన్ని కొనసాగించాలని.. లేనిపక్షంలో పెద్ద ఎత్తున ఆందోళన కార్యక్రమాలు చేపడతామని హెచ్చరించారు.
ఇవీ చదవండి