Vangalapudi Anitha : మహిళలకు వారి ఆత్మరక్షణ కోసం రివాల్వర్లు ఇప్పించే బాధ్యత వైసీపీ మహిళా నేతలు తీసుకోవాలని తెలుగు మహిళ రాష్ట్ర అధ్యక్షురాలు వంగలపూడి అనిత హితవు పలికారు. చీకటి జీవో ఇచ్చినట్టే రివాల్వర్ల పంపిణీకి కూడా జగన్ తక్షణమే జీవో ఇవ్వాలని ఎద్దేవా చేశారు. రివాల్వర్లు ఇప్పించాల్సిన బాధ్యత వైసీపీ మహిళా నేతలపైనే ఉందని స్పష్టం చేశారు. గన్ కంటే ముందు జగన్ రాడు, రాలేడని ఆక్షేపించారు.
ముఖ్యమంత్రిగా జగన్ రెడ్డి అన్ ఫిట్: అనిత - ఏపీ రాజకీయ వార్తలు
Vangalapudi Anitha : చీకటి జీవో ఇచ్చినట్టే మహిళలకు వారి ఆత్మరక్షణ కోసం రివాల్వర్ల పంపిణీకి కూడా జగన్ తక్షణమే జీవో ఇవ్వాలని తెలుగు మహిళ రాష్ట్ర అధ్యక్షురాలు వంగలపూడి అనిత ఎద్దేవా చేశారు. మహిళలకు వారి ఆత్మరక్షణ కోసం రివాల్వర్లు ఇప్పించే బాధ్యత వైసీపీ మహిళా నేతలు తీసుకోవాలని ఆమె హితవు పలికారు.
వంగలపూడి అనిత
దేవినేని అవినాశ్ దాష్టీకానికి బలైన మైనారిటీ మహిళలకు మహిళామంత్రులు ఏం సమాధానం చెబుతారని ప్రశ్నించారు. మహిళోద్ధరణ అంటే పడుపువృత్తిలో ఏపీని తొలిస్థానంలో నిలడపమా జగన్ రెడ్డి అని మండిపడ్డారు. బతుకుదెరువు లేక రాష్ట్ర మహిళలు వేశ్యలుగా మారుతున్నారంటే, ముఖ్యమంత్రిగా జగన్ రెడ్డి అన్ ఫిట్ అని విమర్శించారు.
ఇవీ చదవండి: