Vanagalpudi Anitha: రోజుకో ప్రేమోన్మాది యువతుల ప్రాణం తీస్తున్నా.. ముఖ్యమంత్రికి చీమ కుట్టినట్టు కూడా లేదని తెలుగు మహిళా రాష్ట్ర అధ్యక్షురాలు వంగలపూడి అనిత ధ్వజమెత్తారు. జగన్ రెడ్డి ఉదాసీనత వల్లే రాష్ట్రంలో ఉన్మాదులు రెచ్చిపోతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. మొన్న రమ్య, నిన్న తపస్విని రేపు ఎవరో అని మండిపడ్డారు. జగన్ రెడ్డి మీ అసమర్ద పాలనలో ఇంకెంతమంది మహిళలు బలి కావాలని ప్రశ్నించారు. వైసీపీ పాలనలో పోలీసులు శాంతి భద్రతలు కాపాడటంలో ఫెయిలైనా.. ప్రతిపక్ష నేతల్ని కట్టడి చేయటం, అక్రమ కేసులతో వేధించటంలో సక్సెస్ అయ్యారని ఎద్దేవా చేశారు. టీడీపీ పాలనలోనే మహిళలకు భద్రత, రక్షణ ఉందన్నారు.
శాంతి భద్రతలు కాపాడటంలో విఫలం.. వేధించటంలో సఫలం: వంగలపూడి అనిత - తపస్వి వార్త
Vanagalpudi Anitha: జగన్ రెడ్డి ఉదాసీనత వల్లే ఉన్మాదులు రెచ్చిపోతున్నారని తెలుగు మహిళ అధ్యక్షురాలు వంగలపూడి అనిత ఆగ్రహం వ్యక్తం చేశారు. వైసీపీ పాలనలో పోలీసులు శాంతి భద్రతలు కాపాడటంలో ఫెయిలైనా.. అక్రమ కేసులతో వేధించటంలో సక్సెస్ అయ్యారని విమర్శించారు.
![శాంతి భద్రతలు కాపాడటంలో విఫలం.. వేధించటంలో సఫలం: వంగలపూడి అనిత Etv Bharat](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-17150148-304-17150148-1670502878404.jpg)
Etv Bharat