Teachers Transfers, Promotions: ఉపాధ్యాయుల బదిలీలు, పదోన్నతులు పూర్తి చేస్తామన్న ప్రభుత్వం.. నెలలు గడుస్తున్నా బదిలీలు పూర్తి చేయలేదని యూటీఎఫ్ రాష్ట్ర అధ్యక్షులు నక్కా వెంకటేశ్వరులు, ప్రధాన కార్యదర్శి ప్రసాద్ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఉపాధ్యాయుల సమస్యలపై ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోందని మండిపడ్డారు. ప్రభుత్వం సీపీఎస్ రద్దు, బకాయిలు, బదిలీలపై జాప్యం చేస్తోందని ఆరోపించారు.
'ఉపాధ్యాయుల సమస్యలు పరిష్కరించటంలో ప్రభుత్వ జాప్యం'
Teachers Promotions: ఉపాధ్యాయుల బదిలీలు, పదోన్నతులు చేపడతామని చెప్పిన ప్రభుత్వం.. నెలలు గడుస్తున్నా బదిలీలు చేపట్టటం లేదని యూటీఎఫ్ నేతలు ఆగ్రహం వ్యక్తం చేశారు. సమస్యలను పరిష్కరించటంలో నిర్లక్ష్యాన్ని నిరసిస్తూ మంగళవారం ఉమ్మడి జిల్లాల కలెక్టరేట్ల వద్ద ధర్నా చేపట్టనున్నట్లు ఉపాధ్యాయ సంఘాల నేతలు తెలిపారు.
యూటీఎఫ్
ప్రభుత్వ నిర్లక్ష్య ధోరణికి నిరసనగా.. పీఆర్సీ సమావేశంలో ప్రభుత్వంతో విభేదించి సమావేశం నుంచి బయటకు వచ్చామన్నారు. ఉపాధ్యాయుల సమస్యల విషయంలో ప్రభుత్వం అవలంబిస్తున్న తీరు నిరసనగా.. మంగళవారం ఉమ్మడి జిల్లాల కలెక్టరేట్ల వద్ద ధర్నా చేపట్టనున్నట్లు తెలిపారు. అంతేకాకుండా ఈ నెల 30వ తేదీన విజయవాడలో ధర్నా నిర్వహిస్తామని అన్నారు.
ఇవీ చదవండి: