ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

సంక్రాంతి సంప్రదాయంలో.. పోషకాల పండగ - సంక్రాంతి పండగలో వాడే కొన్ని పదార్ధాల విశిష్టత

ప్రతీ పండగలో కొన్ని సంప్రదాయ వంటకాలకు, ఆహార పదార్థాలకు ప్రత్యేక స్థానం ఉంది. అదే విధంగా సంక్రాంతి పండగలో కూడా కొన్ని పదార్థాలకు స్థానం కల్పించారు. వాటిని ఉపయోగించడం వల్ల పోషకాలతో పాటు అనేక ప్రయోజనాలు కలుగుతాయి. మరి అవేంటో తెలుసుకుందామా!

Nutrient foods
పోషక పదార్థాలు

By

Published : Jan 15, 2023, 12:09 PM IST

సంక్రాంతి పండగలో కొన్ని పదార్థాలకు ప్రత్యేక స్థానం ఉంటుంది. సంప్రదాయం పేరు చెప్పి తిన్నా.. వీటి నుంచి అందే పోషకాలు ఎంతో మేలు చేస్తాయి.

బెల్లం:శరీరం నుంచి ట్యాక్సిన్లనూ తొలగించి కాలేయాన్ని కాపాడుతుంది. బెల్లంలోని ఐరన్‌ రక్తహీనతకు చెక్‌ పెడుతుంది. ఇందులోని పొటాషియం శరీరంలో అధిక సోడియం నిల్వల్ని నిర్వీర్యం చేసి రక్తపోటుని అదుపులో ఉంచుతుంది. ఒంట్లోని నీటిని తగ్గిస్తుంది. ఓ చిన్న బెల్లం ముక్క నోట్లో వేసుకుంటే చాలు త్వరగా జీర్ణమవుతుంది. బెల్లం శరీరంలోని అనేక ఎంజైమ్‌లను ఎసిటిక్‌ ఆమ్లంగా మార్చి జీర్ణవ్యవస్థ పనితీరుని మెరుగుపరుస్తుంది.

చెరకు:ఇవాళ కట్టెల పొయ్యి మీద.. చేసే పొంగలిని కలియబెట్టడానికి చెరకు గడలను వాడతారు. అది అదనపు రుచిని తెచ్చిపెడుతుంది మరి. అతిదాహం, అతి వేడితో బాధపడే వారికిది చక్కటి పరిష్కారం. ఇందులో ఎక్కువగా ఉండే పీచు కొవ్వుని త్వరగా కరిగిస్తుంది. పిండి పదార్థాలూ, మాంసకృత్తులు, పొటాషియం, జింక్‌, ఫాస్ఫరస్‌, క్యాల్షియం వంటి ఖనిజాలూ, ఎ, బి, సి విటమిన్లూ సమృద్ధిగా ఉండటం వల్ల పోషకలేమి సమస్య రాదు. ఖనిజాలు దంతాలకూ, ఎముకలకూ బలాన్నిస్తే... పీచు కొలెస్ట్రాల్‌ స్థాయుల్ని తగ్గించి గుండె ఆరోగ్యాన్ని కాపాడుతుంది. ఇతర పోషకాలు మూత్రపిండాలూ, కాలేయ ఆరోగ్యాన్ని కాపాడతాయి.

రేగు:భోగి రోజున భోగిపళ్లు పేరుతో పిల్లల తలపై పోస్తారు. ఇలా చేస్తే దిష్టి పోతుందనీ, శక్తి అంది ఆయురారోగ్యాలూ పొందుతారని నమ్మకం. రథసప్తమి రోజున జిల్లేడు ఆకుపై ఈ పండ్లను ఉంచి పెద్దలూ స్నానం చేస్తారు. వీటిలో పోషకాలు పుష్కలం. విటమిన్‌ ఎ, పొటాషియం, జింక్‌, మాంగనీస్‌ వంటివెన్నో వీటి నుంచి అందుతాయి. నేరుగా తినొచ్చు. వడియాల్లానూ పెట్టుకోవచ్చు. పచ్చళ్లూ చేసుకోవచ్చు. ఎలా తిన్నా.. రక్తహీనత తగ్గుతుంది. ఎముకలు ఆరోగ్యంగానూ ఉంటాయి.

నువ్వులు: అరిసెలూ, పాకుండలూ, కొబ్బరి బూరెలూ, నువ్వుండలు, జంతికలూ.. ఇలా ఏ పిండి వంటైనా కమ్మదనం రావాలంటే నువ్వులను చేర్చాల్సిందే. వీటిలో శక్తినిచ్చే పోషకాలెన్నో. ముఖ్యంగా ఫైటోకెమికల్స్‌, సెసామిన్‌ అనే సమ్మేళనం, ఆప్టోప్టోసిన్‌ వంటివి క్యాన్సర్‌ నిరోధకాలుగా పనిచేస్తాయి. వీటిల్లో ఉండే కాపర్‌, విటమిన్‌ బీ6 వంటివి కణజాల నిర్మాణానికి అత్యవసరం. నువ్వుల్లో ఉండే మెగ్నీషియం నాడీవ్యవస్థను ఆరోగ్యంగా ఉంచుతుంది. కీళ్ల నొప్పుల బాధితులు రోజూ ఒక స్పూను నువ్వులు తింటే మంచిది. హార్మోన్ల అసమతుల్యతూ ఇది మంచి మందు.

ఇవీ చదవండి:

ABOUT THE AUTHOR

...view details