Ash Mafia: విజయవాడలో బూడిద మాఫియా రెచ్చిపోతోంది. ఎన్‌టీపీఎస్ నుంచి చెరువుకు.. బూడిదతో వెళ్లే పైపులైన్లను గుర్తు తెలియని వ్యక్తులు పగలగొట్టారు. పైపులైన్ల నుంచి వచ్చే బూడిదను తస్కరించి అర్ధరాత్రి సమయంలో తరలిస్తున్నారు. గత కొంతకాలంగా జరుగుతున్న ఈ అక్రమాలను సంస్థ అధికారులు, ఎస్పీఎఫ్ సిబ్బంది అడ్డుకోకపోవటం గమనార్హం. అధికార పార్టీకి చెందిన నాయకుల అండదండలతోనే యథేచ్చగా కార్యకలాపాలు కొనసాగిస్తున్నారని స్థానికులు ఆరోపిస్తున్నారు.
విజయవాడలో రెచ్చిపోతున్న బూడిద మాఫియా..! - andhra news
Ash Mafia: విద్యుత్ చౌర్యం చూసి ఉంటాం.. పెట్రోల్ తస్కరించడాన్నీ చూసి ఉంటాం.. కానీ ఇప్పుడు విజయవాడలో బూడిద దొంగలు పేట్రేగిపోతున్నారు. ఏకంగా ఎన్‌టీపీఎస్ పైప్లైన్లను పగలకొట్టి అర్థరాత్రి వేళ అరాచకంగా దోచుకుంటున్నారు.

పగలకొట్టిన ఎన్‌టీపీఎస్ పైపులైను
ఎన్‌టీపీఎస్ పైపులైన్లను పగలకొట్టి బూడిదను దోచుకునేందుకు యత్నించిన దుండగులు