Road Accidents in NTR District: రోడ్డు ప్రమాదంలో ఎవరైనా మృతి చెందితే.. ఆ ప్రమాదం.. వారి కుటుంబాలని తలకిందులు చేస్తుంది. ఈ రోజు జరిగిన కొన్ని ప్రమాదాల్లో ఇద్దరు మృతి చెందగా పలువురు గాయపడ్డారు. వారి కోసం వాళ్ల తల్లిదండ్రులు, స్నేహితులు, కుటుంబ సభ్యులు ఎంతగా ఎదురు చూస్తూ ఉంటారో కదా..!
విజయవాడ రూరల్ మండలం గూడవల్లి వద్ద జాతీయ రహదారిపై జరిగిన రోడ్డు ప్రమాదంలో ఇద్దరు చనిపోయారు. ఏలూరుకు చెందిన రిజ్వాన్, రఫీ బైక్‌పై వెళ్తుండగా.. వీరి వాహనాన్ని కారు ఢీకొంది. ప్రమాదంలో రిజ్వాన్ అక్కడికక్కడే మృతి చెందాడు. తీవ్రంగా గాయపడిన రఫీని.. స్థానిక ఆసుపత్రికి తరలించారు. చికిత్స పొందుతూ అతనూ మృతి చెందారు. నెల్లూరు జిల్లా చౌకచర్ల గ్రామానికి చెందిన కారు డ్రైవర్ గురుసాయిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.