చేపల వేటలో విషాదం.. చెరువులో మునిగి ఇద్దరు మృతి - ఎన్టీఆర్ జిల్లా అనుమంచిపల్లిలో నీట మునిగి ఇద్దరు మృతి
![చేపల వేటలో విషాదం.. చెరువులో మునిగి ఇద్దరు మృతి Two Died after fell into pond](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-15096996-65-15096996-1650720925563.jpg)
18:00 April 23
ఎన్టీఆర్ జిల్లాలో చెరువులో మునిగి ఇద్దరు మృతి
Two Died After fell into Pond at NTR District: ఎన్టీఆర్ జిల్లాలో చేపల వేట.. రెండు కుటుంబాల్లో తీవ్ర విషాదాన్ని మిగిల్చింది. జగ్గయ్యపేట మండలం అనుమంచిపల్లి చెరువులో చేపలు పట్టడానికి వెళ్లిన ఇద్దరు నీట మునిగి మృతిచెందారు. మృతులు వల్లెపు ప్రవీణ్, మెడ వెంకటరావుగా గుర్తించారు. మొదట ప్రమాదవశాత్తు చెరువులో పడిపోయాడు వెంకటరావు. అది గమనించిన ప్రవీణ్.. వెంకటరావును కాపాడేందుకు నీటిలోకి దిగాడు. ఈ క్రమంలో ఊపిరాడకపోవడంతో ఇద్దరూ చనిపోయారు. దీంతో గ్రామంలో విషాద ఛాయలు అలుముకున్నాయి. సమాచారం మేరకు ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు.. కేసు నమోదు చేసి విచారణ చేపట్టారు.
ఇదీ చదవండి:రాయలసీమ వర్సిటీలో విద్యార్థి ఆత్మహత్యాయత్నం