TTD EO DHARMAREDDY : కోర్టు ధిక్కరణ కేసులో తిరుమల తిరుపతి దేవస్థానం కార్యనిర్వహణాధికారి ధర్మారెడ్డికి ఊరట లభించింది. ఉద్యోగుల క్రమబద్ధీకరణ వ్యవహారంలో దాఖలైన కోర్టు ధిక్కరణ పిటిషన్‌కు సంబంధించి ధర్మారెడ్డికి జైలుశిక్ష, జరిమానా విధిస్తూ.. హైకోర్టు సింగిల్ జడ్జి ఇచ్చిన తీర్పును డివిజన్ బెంచ్ సస్పెండ్ చేసింది. క్రమబద్ధీకరణ ఉత్తర్వులు అమలు చేయడంలేదంటూ.. ముగ్గురు తితిదే ఉద్యోగులు కోర్టులో ధిక్కరణ పిటిషన్ వేశారు. విచారణ జరిపిన సింగిల్ జడ్జి కోర్టు ఆదేశాలను అమలు చేయలేదంటూ.. తితిదే ఈవో ధర్మారెడ్డికి నెలరోజులు జైలు శిక్ష, 2వేల రూపాయల జరిమానా విధించింది. సింగిల్ జడ్జి ఉత్తర్వుల్ని ధర్మారెడ్డి అప్పీల్ చేయగా ఆయనకు ఉపశమనం లభించింది.
కోర్టు ధిక్కరణ కేసులో తితిదే ఈవో ధర్మారెడ్డికి ఊరట - కోర్టు ధిక్కరణ పిటిషన్
TTD EO DHARMAREDDY : కోర్టు ధిక్కరణ కేసులో తితిదే కార్యనిర్వహణాధికారి ధర్మారెడ్డికి ఊరట లభించింది. ఉద్యోగుల క్రమబద్ధీకరణ వ్యవహారంలో కోర్టు ధిక్కరణ పిటిషన్‌కు సంబంధిచి.. జైలుశిక్ష, జరిమానాను డివిజన్ బెంచ్ సస్పెండ్ చేసింది.
తితిదే కార్యనిర్వహణాధికారి ధర్మారెడ్డి