Transgender marriage in karimnagar district: తెలంగాణ రాష్ట్రం కరీంనగర్ జిల్లా జమ్మికుంట మండలంలో ఒక్కటైన ఈ జంటకు సంబందించిన వివరాలు ఆసక్తిని రేకెత్తిస్తున్నాయి. వీణవంకకు చెందిన సంపత్.. సర్జరీతో ట్రాన్స్ జెండర్‌గా మారి.. దివ్య కొంత కాలంగా జమ్మికుంట పట్టణంలో జీవనం సాగిస్తోంది. జగిత్యాలలో నివాసం ఉన్నప్పుడు ట్రాన్స్ జెండర్‌గా మారిపోగా అక్కడే పరిచయం అయిన అర్షద్.. దివ్యను పెళ్లి చేసుకుంటానని రెండు మూడు సార్లు ప్రపోజ్ చేశాడు.
ట్రాన్స్‌జెండర్‌తో యువకుడి ప్రేమ వివాహం - AP News
Transgender marriage in karimnagar district: చూపులు కలిశాయి... మనసులూ కలిశాయి... కలిసి జీవనం సాగించాలనుకున్నారు. మూడు ముళ్ల బంధంతో ఏడడుగులు నడిచి నూతన జీవితంలోకి అడుగు పెట్టారు. ఇదేదో సాధారణ వ్యక్తులకు చెందిన వివాహం అయితే అంత ప్రత్యేకత ఉండేది కాదు. ఓ ట్రాన్స్ జెండర్‌ను వివాహం చేసుకోవడానికి నానా ప్రయత్నాలు చేసి చివరికి సఫలమయ్యాడు. కొత్త జీవితంలో కొంగొత్త ఆశలతో తన జీవిత భాగస్వామి అయిన దివ్య దిశానిర్దేశం చేసిన విధంగా ముందుకు సాగుతానని ఆమెకు మాట ఇచ్చాడు.
![ట్రాన్స్‌జెండర్‌తో యువకుడి ప్రేమ వివాహం Transgender marriage](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-17223991-1061-17223991-1671187730773.jpg)
అయితే మొదట్లో నిరాకరించిన దివ్యను ఒప్పించేందుకు జమ్మికుంటకు వచ్చిన అర్షద్ ఆమెను ఒప్పించి హిందూ సాంప్రదాయం ప్రకారం మెడలో మూడు ముళ్లు వేశాడు. దివ్య సర్జరీ చేయించుకున్న తరువాతే అర్షద్ ప్రపోజల్‌కు ఓకే చెప్పేసింది. కారు డ్రైవర్‌గా జీవనం సాగిస్తున్న అర్షద్ ఇక ముందు దివ్య చెప్పినట్టుగా నడుచుకుంటూ కొత్త జీవితాన్ని ప్రారంభిస్తున్నానన్నాడు. వివాహ బంధంతో ఒక్కటైన తాము ఆదర్శవంతమైన జీవితం గడుపుతామని దివ్య పేర్కొంది. జమ్మికుంటలో ఒక్కటైన ఈ జంట ఇల్లంతకుంట రామాలయంలో పూజలు చేశారు.
ఇవీ చదవండి: