- సీఎం జగన్ పుట్టినరోజు.. శుభాకాంక్షలు తెలిపిన ప్రముఖులు
CM JAGAN BIRTHDAY CELEBRATIONS: తాడేపల్లిలోని క్యాంపు కార్యాలయంలో సీఎం వైఎస్ జగన్ పుట్టినరోజు వేడుకలు వైభవంగా జరిగాయి. పలువురు ఉన్నతాధికారులు, మంత్రులు, ప్రజాప్రతినిధులు జగన్‌కు శుభాకాంక్షలు తెలిపారు.పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.
- రుషికొండ తవ్వకాలపై.. క్షేత్రస్థాయి పరిశీలనకు మేమే కమిటీ నియమిస్తాం: హైకోర్టు
HC ON RUSHIKONDA :రుషికొండలో అనుమతికి మించి తవ్వకాలు జరుపుతున్నారంటూ దాఖలైన పిటిషన్‌పై హైకోర్టు మరోసారి విచారణ జరిపింది. తవ్వకాలపై క్షేత్రస్థాయి పరిశీలనకు తామే కమిటీ వేస్తామని స్పష్టం చేసింది. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.
- చదువు అనే ఆస్తితోనే.. విద్యార్థుల తలరాతలు మారుతాయి: సీఎం
TABS DISTRIBUTION IN AP : ప్రభుత్వ బడుల్లో డిజిటల్ విప్లవానికి శ్రీకారం చుట్టామని.. ముఖ్యమంత్రి జగన్ అన్నారు. బాపట్ల జిల్లా చుండూరు మండలం యడ్లపల్లిలో.. ఎనిమిదో తరగతి విద్యార్థులకు ట్యాబ్‌ల పంపిణీని.. ఆయన ప్రారంభించారు. చదువు అనే ఆస్తితోనే.. పిల్లల తలరాతలు మారతాయన్నారు. అధికారం చేపట్టిన మూడన్నరేళ్లలో ఆ దిశగానే అడుగులు వేస్తున్నామని తెలిపారు.పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.
- నాపై దాడికి ఏడాది పూర్తి.. దోషులకు శిక్ష ఎప్పుడు : వైసీపీ నేత సుబ్బారావు గుప్తా
YCP LEADER SUBBARAO GUPTA PROTEST: తనపై దాడి జరిగి సంవత్సరం పూర్తైన దోషులపై ఇంతవరకు చర్యలు తీసుకోలేదని వైసీపీ నేత సుబ్బారావు గుప్తా ఆరోపించారు. తనకు న్యాయం చేయాలని ప్రకాశం జిల్లా కలెక్టరేట్ ఎదురుగా ఆందోళన చేపట్టాడు. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.
- జార్జియా నుంచి వచ్చి సర్పంచ్‌గా విక్టరీ.. డాక్టర్ కావాలనుకొని చివరకు..
డాక్టర్ కావాలనుకొని ఆమె విదేశాలకు వెళ్లారు.. కానీ అనూహ్యంగా ఆమె ప్రజాసేవలోకి దిగాల్సి వచ్చింది.. కుటుంబానికి రాజకీయం కొత్తేం కాదు.. ఆ ధైర్యంతో స్వదేశానికి తిరిగొచ్చిన 21ఏళ్ల యువతి.. సర్పంచ్‌గా గెలుపొందారు. మహారాష్ట్రలో జరిగిందీ ఘటన. మరోవైపు, ఓ కూరగాయల విక్రేత సైతం సర్పంచ్‌గా గెలవగా.. భాజపా రాష్ట్ర అధ్యక్షుడి కుమార్తె మిశ్రమ ఫలితాలు అందుకున్నారు. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.
- ఇప్పటికే ఆమెకు ముగ్గురు ఆడపిల్లలు.. పిల్లాడి కోసం ప్రయత్నిస్తే ఒకేసారి మరో ముగ్గురు జననం
రాజస్థాన్‌లో ఒకేసారి ముగ్గురు మగపిల్లలకు జన్మినిచ్చింది ఓ మహిళ. కాగా అప్పటికే మహిళలు ముగ్గురు ఆడపిల్లలు ఉన్నారు. మగపిల్లాడి కోసం ప్రయత్నిస్తున్న ఆ దంపతులకు ఒకే కాన్పులో ముగ్గురు మగపిల్లలు జన్మించారు. దీంతో వారి కుటుంబ సభ్యులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.
- ఇమ్రాన్ ఖాన్ 'సెక్స్ కాల్ రికార్డింగ్'తో పాక్‌లో కలకలం.. ఫేక్ అంటున్న పీటీఐ
పాకిస్థాన్ మాజీ ప్రధాని, తెహ్రీక్-ఇ-ఇన్సాఫ్ అధ్యక్షుడు ఇమ్రాన్ ఖాన్ మరో వివాదంలో చిక్కుకున్నారు. ఓ మహిళతో ఆయన మాట్లాడినట్లు ఉన్న అసభ్య సంభాషణకు సంబంధించి.. లీకైన రెండు ఆడియో క్లిప్‌లు వైరల్‌గా మారాయి. అవి బయటకు వచ్చినప్పటి నుంచి పాకిస్థాన్‌లో దుమారం రేగుతోంది. ఈ వ్యవహారంపై స్పందించిన తెహ్రీక్-ఇ-ఇన్సాఫ్ పార్టీ ఆ ఆడియో క్లిప్‌లు నకిలీవని పేర్కొంది. ఇది ఇమ్రాన్ వ్యక్తిత్వాన్ని చంపే కుట్ర అని ఆరోపించింది. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.
- భారీగా పెరిగిన వెండి ధర.. ఏపీ, తెలంగాణలో ఎంతంటే?
Gold Rate Today : దేశంలో బంగారం ధర స్వల్పంగా పెరగగా.. వెండి ధర భారీగా పెరిగింది. తెలుగు రాష్ట్రాల్లోని ప్రధాన నగరాల్లో బంగారం, వెండి ధరలు ఎలా ఉన్నాయంటే? పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.
- ప్రాక్టీస్ సెషన్లో కనిపించని కోహ్లీ.. అందరీ దృష్టి ఆ బంగ్లా ప్లేయర్‌పైనే..
బంగ్లాతో మొదటి పోరులో విజయం సాధించిన టీమ్ ఇండియా రెండో టెస్ట్ కోసం సిద్ధమవుతోంది. అయితే ఈ మ్యాచ్ మొదటి సెషన్‌కు భారత స్టార్ విరాట్ కోహ్లీ గైర్హాజరయ్యాడు. ఎందుకంటే పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.
- ప్రభాస్‌పై నయనతార కామెంట్స్.. డార్లింగ్ అలాంటోడంటూ..
పాన్ ఇండియా స్టార్ ప్రభాస్‌పై కామెంట్స్ చేసింది లేడీ సూపర్ స్టార్ నయనతార. ఏం చెప్పిందంటే.. స్టార్ హీరో ప్రభాస్‌కు దేశవ్యాప్తంగా భారీ సంఖ్యలో ఫ్యాన్ బేస్ ఉన్న సంగతి తెలిసిందే. అయితే ఆయనకు సామాన్యులే కాదు ఎంతో మంది సెలబ్రిటీలు కూడా ఫ్యాన్సే. ఎందుకంటే ఎంత ఎత్తుకు ఎదిగినా ఒదిగి ఉండే మనస్తత్వం ఆయనది. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.