ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

TOP NEWS: ఏపీ ప్రధాన వార్తలు @ 7PM - AP LATEST NEWS

.

TOP NEWS
టాప్ న్యూస్

By

Published : Dec 14, 2022, 7:00 PM IST

  • సందర్శకులను మరింతగా ఆకర్షించేలా.. జూ పార్క్​లను తీర్చిదిద్దాలి: పెద్దిరెడ్డి
    Peddireddy Ramachandra Reddy: రాష్ట్రంలోని జూపార్కులను అభివృద్ధి చేసేందుకు అవసరమైన ప్రణాళికలను సిద్ధం చేయాలని అటవీశాఖ అధికారులను మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ఆదేశించారు. అటవీశాఖ అధికారులతో మంత్రి సమీక్ష నిర్వహించారు. జూపార్క్‌ల్లో.. జంతువుల సమీకరణకు చర్యలు చేపట్టాలని అధికారులను ఆదేశించారు. తిరుపతి జూపార్క్​లో వైట్ టైగర్ సఫారీల కోసం ప్రతిపాదనలు సిద్ధం చేయాలన్నారు. పూర్తి వివరాల కోసం క్లిక్​ చేయండి.
  • ఇన్నాళ్లు దోచుకుని.. ఇప్పుడు సీఎం జగన్‌ వేదాలు వల్లిస్తున్నారు: బొండా ఉమా
    Bonda Uma Fire on Jagan: మూడున్నరేళ్లలో 3లక్షల కోట్ల రూపాయల దోపిడీకి పాల్పడిన జగన్‌ రెడ్డి... ఇక చాలన్నట్లుగా మంత్రివర్గ భేటీలో వేదాలు వల్లించారని తెలుగుదేశం విమర్శించింది. అవినీతిని మీడియా వెలికి తీస్తున్నందున జాగ్రత్త పడాలని మంత్రులకు సూచించిన ముఖ్యమంత్రి.. తన దోపిడీని మాత్రం కొనసాగిస్తున్నారని తెలుగుదేశం నేత బొండా ఉమా ధ్వజమెత్తారు. పూర్తి వివరాల కోసం క్లిక్​ చేయండి.
  • మంత్రి రోజా క్షమాపణ చెప్పాలంటూ.. జనసేన వీర మహిళల ఆందోళన
    Janasena Veera Mahila Powerful Counter: వారాహి పేరుతో కొత్త వాహనం, కలర్‌ఫుల్‌ చొక్కా వేసుకుని పవన్ కల్యాణ్ వస్తే భయపడేవారు ఎవరూ లేరని.. మంత్రి రోజా చేసిన వ్యాఖ్యలపై జనసేన వీర మహిళలు ఆగ్రహం వ్యక్తం చేసారు. నోటికి వచ్చినట్టు రోజా మాట్లాడితే చూస్తూ ఊరుకోమని విశాఖ వీర మహిళలు హెచ్చరించారు.పూర్తి వివరాల కోసం క్లిక్​ చేయండి.
  • ధాన్యం కొనుగోళ్లలో రైతులకు ప్రభుత్వం భరోసా కల్పించాలి: నాదెండ్ల మనోహర్​
    Janasena Party Activist: ధాన్యం కొనుగోళ్లలో రైతులకు ప్రభుత్వం భరోసా ఇవ్వలేకపోయిందని నాదెండ్ల మనోహర్‌ ఆరోపించారు. తేమ శాతం ఎంత ఉన్నా ప్రభుత్వమే కొనుగోలు చేయాలని ఏలూరులో ఆయన డిమాండ్​ చేశారు. ఇటీవల పొలంలో పనిచేస్తూ విద్యుదాఘాతంతో మృతిచెందిన జనసేన కార్యకర్త శ్రీమన్నారాయణ కుటుంబాన్ని నాదెండ్ల మనోహర్ పరామర్శించి.. రూ.5 లక్షల బీమా పరిహారం చెక్కును అందజేశారు. పూర్తి వివరాల కోసం క్లిక్​ చేయండి.
  • దిల్లీ ఎయిమ్స్​పై సైబర్ దాడి చైనా పనే.. 100 సర్వర్లు హ్యాక్.. ఆ డేటా రికవరీ!
    Delhi Aiims Server Hack : దిల్లీలోని ఎయిమ్స్‌ సర్వర్లపై సైబర్‌ దాడి.. చైనా హ్యాకర్ల పనేనని ప్రభుత్వ వర్గాలు వెల్లడించాయి. ప్రస్తుతం సర్వర్లలోని డేటాను రిట్రీవ్‌ చేసినట్లు తెలిపాయి. పూర్తి వివరాల కోసం క్లిక్​ చేయండి.
  • పేరు మార్చుకొని మోసం.. బాలికపై యువకుడు అత్యాచారం.. మతం మారాలంటూ..
    ప్రేమ పేరుతో ఓ ముస్లిం యువకుడు.. హిందూ బాలికను మోసం చేశాడు. ఆమెపై పలుమర్లు అత్యాచారానికి పాల్పడ్డాడు. యువకుడి గురించి బాలికకు నిజం తెలియగానే అతడిని దూరం పెట్టింది. అయితే, ఆ వ్యక్తి బాలికను వేధించడం ప్రారంభించాడు. మతం మారమంటూ ఆమెపై ఒత్తిడి చేస్తున్నాడు.పూర్తి వివరాల కోసం క్లిక్​ చేయండి.
  • తవాంగ్ ఘర్షణపై చైనాకు అమెరికా షాక్.. భారత్​కు పూర్తి మద్దతు
    అరుణాచల్‌ప్రదేశ్‌ తవాంగ్‌ సెక్టార్‌లో జరిగిన ఘర్షణకు సంబంధించి అగ్రరాజ్యం అమెరికా.. చైనాను తప్పుబట్టింది. ఉద్రిక్తతలు తగ్గించడం కోసం భారత్‌ తీసుకొన్న చర్యలకు పూర్తి మద్దతును ప్రకటించింది. పూర్తి వివరాల కోసం క్లిక్​ చేయండి.
  • మస్క్ సంపద డౌన్.. ప్రపంచ కుబేరుడిగా బెర్నార్డ్ ఆర్నాల్ట్.. అసలు ఎవరీయన?
    Bernard Arnault World Richest Man : ప్రపంచ కుబేరుల జాబితాలో ఎలాన్‌ మస్క్‌ రెండో స్థానానికి పడిపోయారు. ఫ్రెంచ్‌ వ్యాపారవేత్త బెర్నార్డ్ ఆర్నాల్ట్ మొదటి స్థానంలో నిలిచారు. పూర్తి వివరాల కోసం క్లిక్​ చేయండి.
  • అర్జున్ తెందుల్కర్​ ఘనత.. అచ్చం సచిన్​లానే.. తొలి మ్యాచ్​లోనే సెంచరీ
    తండ్రికి తగ్గ తనయుడు అనిపించుకున్నాడు దిగ్గజ క్రికెటర్​ సచిన్ తెందుల్కర్​​ తనయుడు అర్జున్​ తెందుల్కర్​. రంజీ ట్రోఫీ 2022-23 సీజన్‌లో భాగంగా రాజస్థాన్‌తో జరుగుతున్న మ్యాచ్‌లో గోవా తరఫున బరిలోకి దిగిన అర్జున్‌.. 178 బంతుల్లో 12 ఫోర్లు, 2 సిక్సర్ల సాయంతో సెంచరీ పూర్తి చేసి సచిన్‌ వారసత్వాన్ని ఘనంగా చాటాడు. పూర్తి వివరాల కోసం క్లిక్​ చేయండి.
  • బాలీవుడ్​ ఫిల్మ్​ మేకర్స్​కు కమల్​హాసన్​ అడ్వైజ్​.. ఏంటంటే?
    తాను చాలా మంది బాలీవుడ్‌ వాళ్లని చూసి స్ఫూర్తి పొందినట్లు కమల్‌ హాసన్‌‌ చెప్పారు. ఈ ఏడాది హిందీ సినిమాలు ఆశించిన స్థాయిలో అలరించకపోవడంపై.. బాలీవుడ్‌ దర్శకులకు ఆయన సలహా ఇచ్చారు. అదేంటంటే.. పూర్తి వివరాల కోసం క్లిక్​ చేయండి.

ABOUT THE AUTHOR

...view details