Road accident: మైలవరం మండలం బొర్రాగూడేనికి చెందిన నక్కనబోయిన గోపాలరావు.. మొక్కజొన్నలను మైలవరంలోని మార్కెట్ యార్డ్‌కు ట్రాక్టర్లో తరలిస్తుండగా చండ్రగూడెం గ్రామ శివారులో ట్రాక్టర్లో డీజిల్ అయిపోయింది. ఫలితంగా ట్రాక్టర్‌ను రోడ్డు పక్కన నిలిపి డీజిల్ తీసుకు రావాలని తన తండ్రికి సమాచారం అందించాడు. ట్రాక్టర్ ముందు భాగంలో గోపాలరావు(30)తో పాటు రైతు రాఘవులు కూర్చుని ఉన్నారు. ఈ క్రమంలో వెనుక నుంచి వేగంగా వచ్చిన లారీ.. ట్రాక్టర్ని ఢీకొంది. ఈ ప్రమాదంలో ట్రాక్టర్ డ్రైవర్ నక్కనబోయిన గోపాలరావు(30)అక్కడిక్కడే మృతి చెందాడు. అతడితో పాటు ఉన్న రైతు రాఘవులు (50)కు తీవ్రగాయాలయ్యాయి. వెంటనే మైలవరం ప్రభుత్వ ఆస్పత్రికి తరలించగా... మెరుగైన చికిత్స కోసం విజయవాడకు తరలించారు. మైలవరం ఎస్.ఐ.రాంబాబు కేసు నమోదు చేసి... మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. టిప్పర్ డ్రైవర్ పరారీలో ఉన్నట్లు తెలిపారు.
డీజిల్ కోసం ఆగడంతో ప్రాణం పోయింది..! - ట్రాక్టర్‌ను ఢీకొన్న టిప్పర్ ఒకరు మృతి
Road accident: మృత్యువు ఎటువైపు నుంచి వస్తుందో ఎవరూ ఊహించలేరు. ఇందుకు ఉదాహరణే ఎన్టీఆర్ జిల్లా మైలవరం మండలం చండ్రగూడెం సమీపంలో జరిగిన ఘటన. ఆగి ఉన్న ట్రాక్టర్‌ను వెనుక వైపు నుంచి టిప్పర్ ఢీ కొనడంతో ఒకరు మృతి చెందగా.. మరొకరికి తీవ్రగాయాలయ్యాయి.
టిప్పర్-ట్రాక్టర్ ఢీకొని ఒకరు మృతి