ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

పంపిణీ జాప్యంతో.. అన్యాక్రాంతమవుతోన్న టిడ్కో ఇళ్ల ముడిసరుకులు - టిడ్కో లబ్దిదారులు

TIDCO HOUSES: ప్రభుత్వ జాప్యంతో టిడ్కో ఇళ్ల పరిస్థితి దారుణంగా మారుతోంది. నిర్మాణ స్థితిలో ఉన్న టిడ్కో ఇళ్ల పర్యవేక్షణ సరిగా లేక నిర్మాణ సామాగ్రి పనికి రాకుండా పోతొంది. టిడ్కో నివాసాల పరిస్థితిపై మరింత సమాచారం మా ఈటీవీ భారత్ ప్రతినిధి వివరిస్తారు.

Tidco
టిడ్కో ఇళ్లు

By

Published : Nov 6, 2022, 2:13 PM IST

TIDCO HOUSES: విజయవాడ సమీపాన జక్కంపూడి కాలనీలోని టిడ్కో ఇళ్ల నిర్మాణానికి తీసుకువచ్చిన నిర్మాణ సామాగ్రి అన్యాక్రాంతం అవుతోంది. ప్రభుత్వం లక్షల రుపాయాల ప్రజాధనాన్ని వెచ్చించి కొనుగోలు చేసిన నిర్మాణ సామాగ్రి ప్రభుత్వ నిర్లక్ష్యంతో పనికి రాకుండా పొతోంది. ఇంటి నిర్మాణం కోసం వినియోగించే కిటికీలు, తలుపులను గుర్తు తెలియని వ్యక్తులు ద్వంసం చేశారు. అలాగే ఇంట్లో నేలపై పరిచేందుకు ఉపయోగించే టైల్స్​ను పగలకొట్టారు. ప్రభుత్వం మాత్రం డిసెంబర్​లో టిడ్కో లబ్దిదారులచే సాముహిక గృహ ప్రవేశాలు చేయిస్తామని గోప్పలు చెబుతోంది. నిర్మాణ సామాగ్రిని ద్వంసం చేస్తుండటంపై లబ్దిదారులు ఆందోళన చెందుతున్నారు.

పంపిణీ జాప్యంతో పతనమవుతున్న టిడ్కో ఇళ్లు.

ABOUT THE AUTHOR

...view details