ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

అష్టకష్టాలు పడుతున్న టిడ్కో లబ్ధిదారులు - చేతులెత్తేసిన వైఎస్ జగన్ సర్కారు - TIDCO houses Beneficiaries news

TIDCO Household Beneficiaries Fire on CM Jagan: టిడ్కో లబ్ధిదారులు రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌ మోహన్ రెడ్డిపై మండిపడుతున్నారు. ప్రభుత్వం ఇచ్చిన టిడ్కో ఇళ్లు దుర్భరంగా ఉన్నాయంటూ ఆవేదన చెందుతున్నారు. అప్పగిస్తే సరిపోతుందా సమస్యలను తీర్చరా? అంటూ ప్రశ్నిస్తున్నారు.

tidco_household_beneficiaries_fire
tidco_household_beneficiaries_fire

By ETV Bharat Andhra Pradesh Team

Published : Dec 22, 2023, 4:42 PM IST

TIDCO Household Beneficiaries Fire on CM Jagan:ఆంధ్రప్రదేశ్‌లో వైఎస్ జగన్ మోహన్ రెడ్డి పరిపాలనలో అవస్థలు పడని ప్రజలు, రైతులు, మహిళలు, యువత లేరంటే అతియోశక్తి కాదు. తాము అధికారంలోకి వచ్చిన తర్వాత పేద ప్రజలకు ఇది చేశాం, అది చేశాం అని బహిరంగ సభల్లో పదే పదే గొప్పలు చెప్పుకొనే సీఎం జగన్‌ టిడ్కో గృహ సముదాయాలకు సంబంధించి బాధ్యతలు మరిచారు. ప్రభుత్వం అందించిన టిడ్కో గృహ సముదాయాలు దుర్భరంగా ఉన్నాయంటూ లబ్ధిదారులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. మౌలిక వసతులు కల్పించకుండా గృహాలను అప్పగిస్తే సరిపోతుందా, సమస్యలను తీర్చరా? అంటూ లబ్ధిదారులు గగ్గోలు పెడుతున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా తొమ్మిది జిల్లాల పరిధిలో జగన్ ప్రభుత్వం లబ్ధిదారులకు అప్పగించిన గృహ సముదాయాల పరిస్థితులపై 'ఈటీవీ భారత్' బృందం చేపట్టిన క్షేత్రస్థాయి పరిశీలనలో పలు సంచలన విషయాలు వెలుగులోకి వచ్చాయి.

అష్టకష్టాలు పడుతున్న టిడ్కో లబ్ధిదారులు - చేతులెత్తేసిన వైఎస్ జగన్ సర్కారు

టిడ్కో ఇళ్లపై సీఎం జగన్ సమీక్షలు-పూర్తి కాని నిర్మాణాలు: రాష్ట్ర వ్యాప్తంగా వైఎస్సార్సీపీ ప్రభుత్వం లబ్ధిదారులకు అందించిన టిడ్కో గృహ సముదాయాల్లో సరైన వసతులు, త్రాగునీరు, డ్రైనేజీ వ్యవస్థ సరిగ్గా లేక నానా అవస్థలు పడుతున్నారు. 11 నెలల క్రితం టిడ్కో గృహాలపై సీఎం జగన్ సమీక్ష నిర్వహించారు. ఆ సమీక్షలో 'టిడ్కో గృహ సముదాయాల్లో పూర్తిగా మౌలిక సదుపాయాలు కల్పించి, లబ్ధిదారులకు అప్పగించాలి. అక్కడ నిర్వహణ బాగుండాలి. పట్టించుకోకపోతే మురికివాడలుగా మారే ప్రమాదం ఉంది. అధికారులు టిడ్కో ఇళ్ల నిర్వహణపై ప్రత్యేక శ్రద్ధ పెట్టాలని' అని అన్నారు. కానీ, మొదటి రెండేళ్లు నిర్మాణం చేపట్టాల్సిన టిడ్కో ఇళ్లను ఆయన పట్టించుకోలేదు.

టిడ్కో ఇళ్లపై హద్దుల్లేని మడమ తిప్పడాలు- మూడేళ్లుగా అదిగో ఇదిగో అంటూ ప్రగల్భాలు

ప్రభుత్వంపై లబ్ధిదారులు విమర్శలు-అడపా దడపా పనులు: ఆ తర్వాత లబ్ధిదారుల నుంచి తీవ్ర వ్యతిరేకత రావడంతో అక్కడక్కడ అడపా దడపా పూర్తి చేశారు. అవి కూడా టీడీపీ ప్రభుత్వంలో 90 శాతంపైగా పూర్తయిన ఇళ్లే. మిగతా 10శాతం పనులు చేయకుండా లబ్ధిదారులకు ఇళ్లు అందిచడంలో అక్కడ నివాసముంటున్న వారు చుక్కలు చూస్తున్నారు. బయట అద్దెలు భరించలేక కొంతమంది లబ్ధిదారులు టిడ్కో ఇళ్లకు వెళ్లి, అవస్థలు పడుతున్నారు. మరికొందరు అక్కడ ఉండలేక మళ్లీ అద్దె ఇళ్లలోకి వెళ్లిపోతున్నారు.

టిడ్కో ఇళ్లపై టీడీపీ ప్రభుత్వం కీలక నిర్ణయాలు: గత ప్రభుత్వం టిడ్కో గృహ సముదాయాలకు సంబంధించి, పలు కీలక నిర్ణయాలు తీసుకుంది. ప్రధానంగా అన్ని రకాల మౌలిక సదుపాయాలు, ఆహ్లాదాన్ని పంచే పచ్చదనం, పిల్లలు ఆడుకునేందుకు ఆట స్థలం, సేద తీరేందుకు ఉద్యానవనం, నడకకు ప్రత్యేక మార్గం, బ్యాంకు, షాపింగ్‌ కాంప్లెక్స్, వాణిజ్య సముదాయాలతో ఇళ్లను నిర్మించి లబ్ధిదారులకు అప్పగించాలని నిర్ణయించింది. అందులో భాగంగానే నెల్లూరులోని గృహ సముదాయంలో పార్కు, వాకింగ్‌ ట్రాక్, ప్రహరీ, వాటిని రూ.80 కోట్ల వ్యయంతో ఏర్పాటు చేసింది. ఇదే తరహా అన్ని చోట్ల ఏర్పాటు చేస్తామని ప్రకటించింది.

వైఎస్సార్సీపీ ప్రభుత్వంపై లబ్ధిదారులు ఆగ్రహం:ఈ నేపథ్యంలో అధికారంలోకి వచ్చిన వైఎస్సార్సీపీ ప్రభుత్వం టిడ్కో గృహ సముదాయాలకు తాగునీరు, మురుగు కాల్వలు, విద్యుత్తు సౌకర్యాలు కల్పించడంలో ఘోరంగా విఫలమైంది. ఉద్యానవనం, నడక మార్గం, షాపింగ్‌ కాంప్లెక్స్‌‌ల నిర్వహణను పురపాలక సంఘాలకే వదిలేసింది. దీంతో చాలా చోట్ల బడి, ఆసుపత్రి, వసతి గృహాలు, ఇతర సౌకర్యాలు ఇప్పట్లో ఏర్పాటయ్యే పరిస్థితులు కన్పించకపోవడంతో లబ్ధిదారులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

Gudivada TIDCO Houses: లబ్ధిదారులకు అందని తాళాలు.. మందుబాబులకు ఆవాసాలుగా టిడ్కో ఇళ్లు

84వేల గృహాల్ని లబ్ధిదారులకు అందించిన జగన్ సర్కార్: ఇప్పటివరకు 84 వేల గృహాల్ని వైఎస్సార్సీపీ ప్రభుత్వం లబ్ధిదారులకు అప్పగించింది. వీటిలో గత ప్రభుత్వ హయాంలోనే 90 శాతంపైగా పూర్తయినవే ఎక్కువ. మిగిలిన 10శాతం పూర్తి చేసి, ఇప్పుడు ఇస్తున్నారు. మొత్తంగా జగన్ ప్రభుత్వం చేపట్టిన 2 లక్షల 62 వేల ఇళ్ల నిర్మాణాలున్న గృహ సముదాయాల్లో తాగునీరు, రహదారులు, మురుగు కాల్వలు, విద్యుత్తు సౌకర్యం, ఎస్టీపీ (S.T.P.) తరహా మౌలిక సదుపాయాల కల్పనకు రూ.3 వేల కోట్లు, మొత్తం నిర్మాణాలకు రూ.6 వేల కోట్లు అవసరమవుతుందని అధికారులు అంచనా వేశారు. అయితే, ఆ నిధులు ఎప్పుడు కేటాయిస్తారు?, 10శాతం పూర్తి కాని నిర్మాణాలను ఎప్పుడు పూర్తి చేస్తారు? అని లబ్ధిదారులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

జగన్ ప్రభుత్వం లబ్ధిదారులకు అందించిన టిడ్కో ఇళ్ల వివరాలు: ''చిలకలూరిపేటలో 4 వేల 512 టిడ్కో ఇళ్లు పూర్తయితే, లబ్ధిదారులకు 4 వేల గృహాలు అప్పగించారు. గుడివాడ మల్లాయపాలెంలో 9 వేల 812 టిడ్కో నిర్మాణాలు పూర్తయితే, 7 వేల ఇళ్లను లబ్ధిదారులకు అప్పగించారు. విశాఖ A.S.R. కాలనీలో 280 టిడ్కో ఇళ్లను లబ్ధిదారులకు అప్పగించారు. అమలాపురం బోడసకుర్రులో 16 వందల 32 గృహాలను లబ్ధిదారులకు అప్పగించారు. పెద్దాపురంలో 17వందల 68 గృహాలు పూర్తయ్యాయి. వీటిలో లబ్ధిదారులకు 14 వందల 60 గృహాలు అప్పగించారు. తాడేపల్లిగూడెంలో 3వేల 72 గృహాలు పూర్తయ్యాయి. వీటిలో 11 వందల మంది నివాసముంటున్నారు. ఉమ్మడి చిత్తూరు జిల్లాలో శ్రీకాళహస్తి, పుత్తూరు, నగరి, పురపాలక సంఘాలతో పాటు తిరుపతి, చిత్తూరులో టిడ్కో ఇళ్లలో లబ్ధిదారులు అవస్థలు పడుతున్నారు.'' అని ఈటీవీ భారత్-ఈటీవీ-ఈనాడు క్షేత్రస్థాయి పరిశీలనలో లెక్కలు వెలుగులోకి వచ్చాయి.

గూడూరులో దాదాపు 5,120 గృహాలు పూర్తి చేసి, 2వేల మంది పేదలకు అప్పగించారు. నెల్లూరు జిల్లా ఆత్మకూరులో 10 వందల 56 గృహాలు పూర్తి చేసి, లబ్ధిదారులకు అప్పగిస్తే 600 మంది మాత్రమే నివాసం ఉంటున్నారు. ఆళ్లగడ్డలో 13 వందల 92 గృహాలను లబ్ధిదారులకు అందిస్తే, కేవలం 170 కుటుంబాలే అందులో నివసిస్తున్నాయి. విజయనగరం జిల్లా సారిపల్లి సమీపంలో మొత్తం 2 వేల 656 గృహాలుండగా, తొలి రెండు విడతల్లో 12 వందల 80 మందికి గృహ ప్రవేశాలకు అవకాశం కల్పించారు. వీరిలో 400 మంది మాత్రమే చేరారు. శ్రీకాకుళంలో 1,282 ఇళ్లను లబ్ధిదారులకు హడావిడిగా పంచింది.

pratidwani: టిడ్కో ఇళ్ల లబ్దిదారుల ఎదురుచూపులు

ABOUT THE AUTHOR

...view details