ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

విజయవాడలో అర్ధరాత్రి దొంగల హల్‌చల్‌.. ఆ గ్యాంగేనా..!

Theft attempt: ఎన్టీఆర్ జిల్లా విజయవాడ అజిత్ సింగ్ నగర్​లో అర్ధరాత్రి దొంగలు హల్‌చల్‌ చేశారు. రైల్వేట్రాక్‌ సమీపంలోని ఓ ఇంటి తలుపులను నిక్కర్లతో వచ్చిన ముగ్గురు దుండగులు పగులగొడుతుండగా స్థానికులు వారిని పట్టుకుని దేహశుద్ధి చేసి పోలీసులకు అప్పగించారు.

thief
దొంగ

By

Published : Dec 26, 2022, 3:44 PM IST

Attempted theft in House : ఎన్టీఆర్ జిల్లా విజయవాడ అజిత్ సింగ్ నగర్​లో అర్ధరాత్రి దొంగలు అలజడి సృష్టించారు. లూనా సెంటర్ సమీపంలోని రైల్వే ట్రాక్ సమీపంలోని ఓ ఇంటి తలుపులను నిక్కర్లపై వచ్చిన ముగ్గురు దొంగలు పగలగొడుతుండగా స్థానికులు గమనించారు. వీరిలో ఒకరిని పట్టుకోగా.. మరో ఇద్దరు పరారయ్యారు. నిక్కర్లతో దొంగతనానికి రావడంతో చెడ్డి గ్యాంగ్ అంటూ స్థానికంగా అలజడి రేగింది. దొంగను చితకబాది తాళ్ళతో బంధించి పోలీసులకు అప్పగించారు.

అర్ధరాత్రి సుమారు రెండున్నర గంటల సమయంలో ముగ్గురు అగంతకులు కత్తులు, ఐరన్ రాడ్లతో ఇంటికి తలుపును పగలగొట్టేందుకు యత్నించగా స్థానికులు వీరిని గమనించగా.. పరారయ్యే ప్రయత్నం చేశారు. దొంగలు ముందుగా కత్తులతో స్థానికులను బెదిరించగా ఉప్పు నాగేశ్వరరావుకు చెందిన రాకీ, బన్నీ అనే పెంపుడు కుక్కలు వెంబడించి వారిని నిలువరించాయి. అనంతరం ముగ్గురు దొంగలలో ఇద్దరు పారిపోగా.. ఒకరిని తాళ్ళతో బంధించి పోలీసులకు అప్పగించారు. కాగా స్థానికులు వెంబడించే క్రమంలో వాళ్ళు ప్రతిఘటించిన చెడ్డి గ్యాంగ్ సభ్యులు కావచ్చనే అనుమానం వ్యక్తం చేస్తున్నారు. ఈ సంఘటనను అజిత్ సింగ్ నగర్ పోలీసులు లైట్​గా తీసుకొని తూతూ మంత్రంగా విచారణ పూర్తి చేస్తున్నట్లు తెలుస్తోందని పలువురంటున్నారు. అజిత్ సింగ్ నగర్ రైల్వే ట్రాక్ ప్రాంతంలో గస్తీ ముమ్మరం చేయాలని స్థానికులు కోరుతున్నారు.

ఇవీ చదవండి:

ABOUT THE AUTHOR

...view details