Bike Theft:విజయవాడలోని ఇబ్రహీంపట్నం పోలీస్ స్టేషన్ ఎదురుగా పార్క్ చేసి ఉంచిన బైకును గుర్తు తెలియని వ్యక్తి దొంగిలించాడు. తాళం బైక్కు ఉండడాన్ని గమనించిన వ్యక్తి చాకచక్యంగా బైక్ను ఎత్తుకెళ్లి పోయాడు. పోలీస్ స్టేషన్ దగ్గరలోని ఓ సీసీ కెమెరాలో ఈ దృశ్యాలు నిక్షిప్తమయ్యాయి.
పోలీస్ స్టేషన్ ఎదురుగా పార్క్ చేసిన బైక్ చోరీ చేసిన దొంగ - Ap Latest News
Bike Theft ఈ దొంగ మామూలోడు కాదు. ఎవరి వస్తువు అయితే నాకేంటి నాపనేదో నేను చేసేస్తే పోలా అనుకున్నాడు. అంతే కానిస్టేబుల్ బైక్ నే చోరీ చేశాడు. ఇంతకి ఇది ఎక్కడ జరిగిందంటే.
విజయవాడ జిల్లా ఇబ్రహీంపట్నం పోలీస్ స్టేషన్ ఎదురుగా ఓ కానిస్టేబుల్ బండిని పార్క్ చేశాడు. పోలీస్ స్టేషన్ ఎదురుగానే కదా! ఎవరు తీసుకుపోతారు అనుకున్నాడో లేక మర్చిపోయాడో తాళం కూడా దానికే వదిలేశాడు. ఈ విషయాన్ని గమనించిన దొంగ చక్కగా తన చేతివాటం ప్రదర్శించాడు. చుట్టూ చూసి తర్వాత దర్జాగా బైక్ తీసుకుని అక్కడ నుంచి వెళ్లిపోయాడు. పోలీస్ స్టేషన్ ఎదురుగా నిలిపి ఉంచిన బైక్ చోరీకి గురికావడంతో పోలీసులు అవాక్కయ్యారు. వెంటనే అక్కడున్న సీసీ కెమెరాలను పరిశీలించారు. అందులో నమోదైన దృశ్యాల ఆధారంగా ఆ దొంగను పట్టుకునేందుకు పోలీసులు ప్రయత్నిస్తున్నారు.
ఇవీ చదవండి: