ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

దిగజారిన ర్యాంకు: స్టార్టప్‌ల ర్యాంకింగ్​లో ఏపీది 15 వ స్థానం.. 8 లో తెలంగాణ - startup companies

Startup Companies in AP : అంకురాలకు అనువైన రాష్ట్రాల వివరాలను కేంద్రం ప్రకటించింది. ఈ ర్యాంకులలో రాష్ట్రానికి 15 స్థానం లభించింది. ఆంధ్రప్రదేశ్​ కంటే.. ముందు ర్యాంకుల్లో బిహార్​, ఒడిశా వంటి రాష్ట్రాలు ఉన్నాయి. 4,566 స్టార్టప్‌లతో తెలంగాణ 8వ స్థానంలో నిలిచింది. తొలి అయిదు స్థానాలను మహారాష్ట్ర, కర్ణాటక, దిల్లీ, ఉత్తర్‌ప్రదేశ్‌, గుజరాత్‌ ఆక్రమించాయి.

Etv Bharat
Etv Bharat

By

Published : Feb 4, 2023, 7:38 AM IST

Updated : Feb 4, 2023, 9:31 AM IST

Startup Companies Ranking : స్టార్టప్‌లకు అనువైన రాష్ట్రాల ర్యాంకింగ్‌లో రాష్ట్రం 15వ స్థానానికి పడిపోయింది. ఏపీ కన్నా బిహార్‌, ఒడిశా, మధ్యప్రదేశ్‌ రాష్ట్రాలు ముందున్నట్లు కేంద్ర ఐటీ, ఎలక్ట్రానిక్స్‌ మంత్రిత్వశాఖ వెల్లడించింది. రాజ్యసభలో బీజేపీ ఎంపీ జీవీఎల్​ నరసింహారావు అడిగిన ప్రశ్నకు కేంద్రం లిఖితపూర్వకంగా సమాధానమిచ్చింది.

2016 సెప్టెంబరులో ప్రారంభించిన స్టార్టప్ ఇండియా కార్యక్రమం కింద ఇప్పటివరకు 86 వేల713 స్టార్టప్​లను డీపీఐఐటీ గుర్తించింది. వీటిల్లో ఏపీకి చెందిన అంకుర సంస్థలు కేవలం 1,341 మాత్రమే ఉన్నాయి. ఇప్పటి వరకు స్టార్టప్‌ల ద్వారా దేశవ్యాప్తంగా 8.92 లక్షల మందికి ఉపాధి కల్పించగా.. అందులో రాష్ట్రానికి చెందిన వారు కేవలం 12వేల 557 మందే ఉన్నారని కేంద్రమంత్రి వెల్లడించారు. స్టార్టప్ ఎకోసిస్టమ్స్‌ను ప్రోత్సహించేందుకు కేంద్రం తీసుకుంటున్న విధానపరమైన చర్యల ఆధారంగా రాష్ట్రాల ర్యాంకింగ్‌లో ఆంధ్రప్రదేశ్ 29వ స్థానంలో ఉందని మంత్రి సమాధానంలో పేర్కొన్నారు.

ఎనిమిదవ స్థానంలో నిలిచిన తెలంగాణ :దక్షిణాదిలో కర్ణాటక, తమిళనాడు, తెలంగాణ, కేరళ తర్వాతి స్థానంలో ఆంధ్రప్రదేశ్‌ నిలిచింది. కేంద్రం ప్రకటించిన స్టేట్స్‌ స్టార్టప్స్‌ ర్యాంకింగ్‌ ఎక్సైజ్‌-2022లో తెలంగాణ టాప్‌ పెర్ఫార్మర్‌గా 7వ స్థానంలో నిలించింది. కేంద్ర ప్రభుత్వం 2016 జనవరి 16న స్టార్టప్‌ ఇండియా కార్యక్రమాన్ని ప్రారంభించింది. 2019 ఫిబ్రవరి 19న కేంద్ర ప్రభుత్వం జారీచేసిన నోటిఫికేషన్‌లోని అర్హతల ప్రకారం ఏర్పాటైన వాటిని డిపార్ట్‌మెంట్‌ ఫర్‌ ప్రమోషన్‌ ఆఫ్‌ ఇండస్ట్రీ అండ్‌ ఇంటర్నల్‌ట్రేడ్‌ (డీపీఐఐటీ) స్టార్టప్‌లుగా గుర్తిస్తూ వస్తున్నారు.

అలా గుర్తింపు పొందిన 86,713 స్టార్టప్‌లలో ఆంధ్రప్రదేశ్‌ 15వ స్థానంలో నిలిచింది. ఏపీ తర్వాతి స్థానంలో ఛత్తీస్‌గఢ్‌, పంజాబ్‌, ఝార్ఖండ్‌తోపాటు ఈశాన్యరాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలు మాత్రమే ఉన్నాయి. ఏపీలో ఏర్పాటైన స్టార్టప్‌ల ద్వారా 2022 డిసెంబరు 31 నాటికి 12,557 మందికి ఉపాధి లభించింది’ అని కేంద్ర ఎలక్ట్రానిక్స్‌ అండ్‌ ఐటీశాఖ సహాయమంత్రి రాజీవ్‌చంద్రశేఖర్‌ శుక్రవారం రాజ్యసభలో తెలిపారు.

తెలంగాణలో 50,318 మందికి ఉద్యోగాలు లభించినట్లు తెలిపారు. దేశవ్యాప్తంగా ఏర్పాటైన 86,713 స్టార్టప్‌ల్లో ఒక్కోదాని ద్వారా సగటున 10.28 ఉద్యోగాల చొప్పున 8,91,604 ఉద్యోగాలు రాగా ఏపీలోని స్టార్టప్‌ల ద్వారా సగటున 9.36 ఉద్యోగాలు మాత్రమే లభించాయి. తెలంగాణలో ఇది 11.02 మేర ఉంది.

ఇవీ చదవండి :

Last Updated : Feb 4, 2023, 9:31 AM IST

ABOUT THE AUTHOR

...view details