Lord Shiva In Various faces: పురాణాల్లో చాలా సందర్బాల్లో పరమేశ్వరుడు అవతరించిన రూపాలు సుమారు 175 వరకు ఉన్నాయని ప్రకటిస్తున్నాయి. వీటిలో మనం అర్చించి, అభిషేకం చేసేది ఒక లింగరూపానికి మాత్రమే. వీటి గురించి శైవాగమ ధ్యాన రత్నావళి అనే గ్రంథంలోని జ్ఞానపాదం, యోగపాదం అనే విభాగాల్లో స్వామి అవతరించిన సందర్భం, సాక్షాత్కరించిన రూపం ఆధారంగా శివుడి రూపాల్ని విభజించనట్లు ఉంది.
సృష్టి రూపాలు : ఈ సృష్టి వ్యవహారంలో బ్రహ్మదేవుడు సృష్టికర్త అయితే.. బ్రహ్మకి సృష్టించే శక్తిని ఇచ్చింది శివుడేనని ఆగమాలలో పొందుపరచి ఉంది. కొన్ని సందర్భాల్లో తనలోనే సృష్టి ఉందని ఈ లక్షణాన్ని ప్రకటిస్తూ మల్లిఖార్జునుడు ధరించిన రూపాలివి. విష్ణువు కూడా నిరంతరం పరమేశ్వరుడినే ధ్యానిస్తాడు.
అనుగ్రహ రూపాలు : శివుడి ఆజ్ఞ లేనిదే చీమైన కుట్టదు అనేది ఈ రూపం తెలియజేస్తుంది. పరమేశ్వరుడు నిర్వహించే పంచకృత్యాలలో ఇది చాలా తేలికైన విషయం. ఏదైన పనికి విఘ్నం కలిగించాలన్నా, ఆ విఘ్నాన్ని తొలగించాలన్నా అది ఆ లింగమూర్తి ఆధీనంలో ఉంటుంది. విఘ్న కర్త, హర్త కూడా శివుడే.. ఈ లక్షణాన్ని తెలియజేస్తూ శంకరుడు ధరించిన అవతారాలివి..
తిరోధాన రూపాలు : ఈ సృష్టిలోని చైతన్యాన్ని కొద్దికొద్దిగా వెనక్కు తీసుకోవటమే తిరోధానం అంటారు. అంటే తనచే ఆవిర్భవించిన విశ్వం, అందులోని శక్తిని శివుడు నెమ్మదిగా తనలో లయం చేసుకుంటాడు.