Timeslot policy In Indrakeeladri: విజయవాడ ఇంద్రకీలాద్రిపై దసరా నవరాత్రులను పురస్కరించుకుని తొలిసారిగా వీఐపీల కోసం టైంస్లాట్ విధానాన్ని ప్రవేశపెట్టాలని యోచిస్తున్నట్లు దేవదాయశాఖ మంత్రి కొట్టు సత్యనారాయణ తెలిపారు. ఈ విషయమై దేవాదాయశాఖ కమిషనర్ హరిజవహర్‌లాల్, ఆలయ ఈవో భ్రమరాంబ ఇతర అధికారులతో మంత్రి సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ ఏడాది భక్తుల రద్దీ ఎక్కువగా ఉంటుందనే అంచనాలతో ఇంద్రకీలాద్రి కొండ ప్రాంతాన్ని పూర్తిగా క్యూలైన్లతో భక్తులకు కేటాయించి- కనకదుర్గనగర్ నుంచి లిఫ్ట్ మార్గంలో వీఐపీలను ఆలయానికి తీసుకొచ్చి అమ్మవారి దర్శనం చేయించాలని భావిస్తున్నారు.
Indrakeeladri: ఇంద్రకీలాద్రిపై వీఐపీల కోసం టైం స్లాట్.. దసరా నుంచి..! - durga temple
Vijayawada Durga Temple: దసరా నవరాత్రుల ఏర్పాట్లపై ప్రభుత్వం దృష్టి సారించింది. ఈసారి ఇంద్రకీలాద్రిపై భక్తుల కోసం క్యూలైన్లను, వీఐపీల కోసం లిఫ్ట్ మార్గాలను ఏర్పాటు చేయనున్నారు. అయితే మొదటిసారిగా వీఐపీల కోసం టైంస్లాట్ విధానాన్ని తీసుకురావాలనే ఆలోచనలో దేవదాయ శాఖ ఉంది.
ఇంద్రకీలాద్రి
ఇందుకోసం ఐదు టైం స్లాట్‌లను ప్రతిపాదించినట్లు మంత్రి కొట్టు సత్యనారాయణ తెలిపారు. దసరా వేళ దూరప్రాంతాల నుంచి అమ్మవారి దర్శనం కోసం వచ్చే ప్రతి భక్తుడికీ ఎలాంటి అసౌకర్యం లేకుండా చూడాలనేది రాష్ట్ర ప్రభుత్వ ఉద్దేశ్యమన్నారు. ఇందుకు అవసరమైన ప్రతి ఏర్పాటు చేస్తున్నట్లు ప్రకటించారు. టైంస్లాట్ ప్రతిపాదనలపై సమగ్ర చర్చ జరిపి ఓ కార్యాచరణ ప్రకటిస్తామని మంత్రి తెలిపారు.
ఇవీ చదవండి: